దక్షిణాఫ్రికా గెలుపు

దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్‌ విజయం కోసం భారత్‌ ఎదురు చూడాల్సిందే. రసవత్తర మలుపులు తిరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. 28 ఓవర్లలో 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 25.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. క్లాసెన్‌ (43 నాటౌట్‌; 27 బంతుల్లో 5×4, 1×6), మిల్లర్‌ (39; 28 బంతుల్లో 4×4, 2×6), ఫెలుక్వాయో (23 నాటౌట్‌; 5 బంతుల్లో 1×4, 3×6) విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 289 పరుగులు చేసింది. వందో వన్డే ఆడుతూ శిఖర్‌ ధావన్‌ సెంచరీ (109; 105 బంతుల్లో 10×4, 2×6) చేయగా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (75; 83 బంతుల్లో 7×4, 1×6) మరోసారి చక్కటి బ్యాటింగ్‌తో అలరించాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 158 పరుగులు జోడించారు. వీళ్లిద్దరూ ఉన్నంతవరకు 320 చేసేలా కనిపించిన భారత్‌.. తర్వాత తడబడి ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com