దక్షిణ భారతీయులకు గుండెపోటు ముప్పు అధికం

దేశంలో అత్యధికంగా గుండెపోటుతో మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, అండమాన్‌ దీవులు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రాంతాల వారీగా 2010-13 మధ్యకాలంలో సంభవించిన మరణాలకు గల కారణాలను 375 నమూనా ప్రాంతాల్లో సర్వేచేసింది. ఆమేరకు జాతీయ జనగణన విభాగం గణాంకాంలను విడుదల చేసింది. 2014 నుంచి 2017 వరకూ ఇప్పుడు జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇందుకోసం 541 నమూనా ప్రాంతాలలో మరణాలకు గల కారణాలను ఆరా తీస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటైనందున జనన, మరణాల వివరాలను విస్తృతంగా సేకరిస్తున్నారు. ఈ నివేదికలో ముఖ్యాంశాలు.
* దేశవ్యాప్తంగా గుండె జబ్బుల వల్ల మరణిస్తున్న వారి శాతమే ఇతర కారణాలకన్నా ఎక్కువగా ఉంది. 201013 మధ్యకాలంలో పురుషుల్లో 25.1, మహిళలు 20.1 శాతం మంది గుండెపోటుకు గురయ్యారు. 3069 ఏళ్ల వయసు గల పురుషుల మరణాల్లో గుండెపోటువి 22.4 శాతమున్నాయి.
* 1529 ఏళ్ల మధ్య వయసున్న యువతలో పట్టణాల్లో 9.5 శాతమంది గుండె జబ్బులతో కన్నుమూస్తే గ్రామీణంలో వీరిశాతం 7.4గా ఉంది. కేన్సర్‌ బారిన పడి రెండు ప్రాంతాల్లో దాదాపు సమానంగా 4.7 శాతం మంది చనిపోయారు.
* దేశవ్యాప్తంగా 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు గల యువకుల మరణాలు పట్టణాల్లో 11.6 శాతం ఆత్మహత్యలుండగా గ్రామీణంలో 16 శాతంగా ఉంది. గ్రామీణ అమ్మాయిల్లో 22, పట్టణ ప్రాంతాల వారు 18.7 బలవన్మరణాలకు పాల్పడ్డారు.
* పట్టణ ప్రాంత యువ మరణాల్లో ఆత్మహత్యలు తక్కువుండగా గ్రామీణంలో అధికంగా కనిపిస్తున్నాయి.
* 30 ఏళ్ల వయసు దాటిన నగరవాసుల్లో పురుషుల్లో గుండెపోటు మరణాలు 38.9 శాతముంటే గ్రామీణుల్లో 31.6 శాతముంది.
* మోటారు సైకిల్‌ ప్రమాదాలు వంటి వాటికి గురై గాయాలతో మరణించిన వారిలో పట్టణ యువకులు 33.9, గ్రామీణుల్లో 34.3 శాతమున్నారు.
* రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల పురుషుల మరణాల్లో గుండెపోటువి 15.5 శాతముంటే, ఉమ్మడి ఏపీ, కర్ణాటక, అండమాన్‌ దీవులకు కలిపి 31.1 శాతముంది. మహిళల్లోనూ వరసగా 11.6 శాతం, 25.3 శాతం ఉన్నట్లు తేల్చారు.
* బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో చెందని రాష్ట్రాలను పోలిస్తే గుండె జబ్బుల మరణాల మధ్య వ్యత్యాసం 100 శాతం కంటే ఎక్కువుండటం గమనార్హం.
* మొత్తం మరణాల్లో అంటువ్యాధుల వల్ల ప్రాణం పోతున్నవారు 27.74, ఇతర రోగాల వల్ల కన్నుమూసినవారు 49.21 శాతమున్నట్లు తేలింది.
* మరణాల్లో అత్యధికంగా 55 ఏళ్లు వాటినవారే 60.5 శాతమున్నారు. పురుషులకన్నా మహిళలు ఎక్కువగా 55 ఏళ్లు దాటిన తరవాత 64.3 శాతం మరణిస్తున్నట్లు గుర్తించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com