దళారులను ఏరి పారేయాలి

సినీ పరిశ్రమలో స్థానిక మహిళలకే అవకాశం కల్పించాలని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ కోరారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ విధానాన్ని నిరసిస్తూ మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. సినీనటులు శ్రీరెడ్డి, అపూర్వ , పీవోడబ్ల్యూ నేత సంధ్య, ఓయూ విద్యార్థి సంఘం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ సహాయం వల్లే హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందన్నారు. చిత్ర పరిశ్రమలో దళారీ వ్యవస్థను ప్రభుత్వం అరికట్టాలని కోరారు. జూనియర్‌ ఆర్టిస్టులకు పింఛను, ఆరోగ్య కార్డుల విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. నటించాలనే తపనతో వచ్చిన మహిళలను పెద్దలు మోసం చేయడం తగదరన్నారు. మహిళలు, నటులపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమ్మాయిల పట్ల కొందరు విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నారన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com