దివాళా కంపెనీతో

‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘2.ఓ’ చిత్రం విడుదల ఎప్పుడెప్పుడా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని 2017 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ, వీఎఫ్‌ఎక్స్‌ పనులు, కొంతభాగం చిత్రీకరణ ఉండటం వల్ల 2018 జనవరికి వాయిదా వేశారు. అప్పటికి కూడా పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు పూర్తి కాలేదు. దీంతో విడుదల తేదీని ఏప్రిల్‌కి మార్చారు. ఆ తర్వాత సినిమా విడుదల ఎప్పుడన్న దానిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారం లేదు. కోలీవుడ్‌లో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘2.ఓ’ అసలు ఈ ఏడాదే విడుదల కాదట. ‘2.ఓ’కు సంబంధించిన చిత్రీకరణ గతేడాది సెప్టెంబరులోనే పూర్తయింది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించిన ఈ చిత్రం కాస్తా రూ.350కోట్ల బడ్జెట్‌ను దాటిపోయిందని సమాచారం. మరోపక్క వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఆలస్యమవుతున్నా, సినిమాను ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున, లేదా దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేశారు. ఇదే సమయంలో వీఎఫ్‌ఎక్స్‌ పనులు చేపట్టిన కంపెనీ కాస్తా దివాలా తీయడంతో చిత్ర బృందం తలపట్టుకుని కూర్చొంది. త్వరగా ప్రత్యామ్నాయా మార్గాలను అన్వేషిస్తోంది. దీంతో ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానట్లేనని అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రటకన రావాల్సి ఉంది. ‘2.ఓ’లో అమీ జాక్సన్‌ కథానాయిక . శంకర్‌ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు సమకూరుస్తున్నారు. 2010 సూపర్‌ హిట్‌ ‘రోబో’కు సీక్వెల్‌గా వస్తోన్న చిత్రమిది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com