దీక్షకు ముగింపు

ఉద్దానం వెనుకబడ్డ ప్రాంతం కాదని.. వెనక్కి నెట్టబడిన ప్రాంతమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శనివారం సాయంత్రం ఐదుగంటలకు ఆయన నిరాహార దీక్షను విరమించారు. ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల సమస్యపై తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సాయంత్రం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తాను రాజకీయ లబ్దికోసం దీక్ష చేయలేదని ఆయన తెలిపారు. తనకు రాజకీయ లబ్ధి కావాలనుకుంటే చంద్రబాబుకు మద్దతు ఇచ్చేవాడిని కాదని తెలిపారు. రూ.2,000 కోట్లు పుష్కరాలకు ఖర్చుపెట్టిన వారు.. జబ్బుతో 20,000 మంది చనిపోయిన చోట ఖర్చుపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మోసం చేసిన కేంద్రం, ఆ కేంద్రానికి మద్దతిచ్చిన తెలుగుదేశంపై నిరసనగా ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. సామాజిక రాజకీయ చైతన్యం కోసం జనసేన పార్టీ పోటీ చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలను సమావేశపరిచి కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఉద్దానం సమస్యను పరిష్కరించవచ్చన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com