దుర్గగుడిలో ప్రత్యేక శాంతిహోమం

విజయవాడ దుర్గగుడిలో ప్రత్యేక శాంతి హోమం నిర్వహించారు. ఇటీవల జరిగిన దుర్గగుడి పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, దుర్గగుడి ఈవో పద్మ, పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబు హాజరయ్యారు. దుర్గగుడి వేద పండితుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. గణపతి పూజతో కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ తర్వాత పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ట, అగ్ని ప్రతిష్ట చేసి… ఆ తర్వాత శాంతిహోమం చివరగా పూర్ణాహుతి నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మవారి అనుగ్రహం కలగాలని సంకల్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ చేస్తోన్న పోరాటానికి దైవబలం తోడు కావాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు దుర్గగుడి వేద పండితులు తెలిపారు. చంద్రబాబు చేస్తోన్న ధర్మపోరాటం జయప్రదం కావాలని దుర్గగుడిలో హోమం నిర్వహించటం పట్ల మంత్రి దేవినేని ఉమ, ఎంపీ కేశినేని సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవారి అనుగ్రహం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉంటుందని ఆకాంక్షించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com