ద్రావిడ్ లేని కలల జట్టు

పాకిస్థాన్‌ క్రికెట్‌ దిగ్గజం యూనిస్‌ ఖాన్‌ తన ఆల్‌ టైమ్‌ టెస్టు క్రికెట్‌ జట్టును ప్రకటించాడు. లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ సోషల్‌ మీడియా ద్వారా యూనిస్‌ ఖాన్‌ ప్రకటించిన ఈ జట్టులో భారత తరఫున సచిన్‌ తెందూల్కర్‌ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. జట్టు సారథిగా పాకిస్థాన్‌ దిగ్గజం ఇమ్రాన్‌ ఖాన్‌ పేరును సూచించాడు. ఓపెనర్లుగా హనీఫ్‌ మహమ్మద్‌, సచిన్‌ తెందూల్కర్‌ పేర్లను పేర్కొన్నాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌గా ఆల్‌రౌండర్‌ కలీస్‌, తర్వాతి స్థానాల్లో బ్రియన్‌ లారా, సర్‌ వివ్‌ రిచర్డ్స్‌, గ్యారీ సోబర్స్‌ ఉంటారని తెలిపాడు. వికెట్‌ కీపర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌కు తన కలల జట్టులో చోటిచ్చాడు. బౌలర్లుగా సర్‌ రిచర్డ్‌ హడ్లే, గ్లేన్‌ మెక్‌గ్రాత్‌, ముత్తయ్య మురళీధరన్‌ పేర్లను పేర్కొన్నాడు. తన ఆల్‌ టైమ్‌ టెస్టు జట్టుగా ఇదే అత్యంత బలమైన జట్టు అని యూనిస్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు. యూనిస్‌ఖాన్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు మూడు ఫార్మెట్‌లలో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు. అదేవిధంగా పాకిస్థాన్‌ తరఫున టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగులు, అధిక సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా యూనిస్‌ ఖాన్‌ పేరిట అరుదైన రికార్డు ఉంది. టెస్ట్‌ క్రికెట్‌లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి పాకిస్థాన్‌ క్రికెటర్‌ కూడా యూనిస్‌ ఖానే. అంతేగాకుండా 2004లో భారత్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఈ పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇక 2009లో పాకిస్థాన్‌ ఇతని సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com