ధాన్యానికి ఉమా పూజలు

ఈ నెల 31న పోలవరం డయాఫ్రాం పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామానికి వెళ్లిన ఆయన అక్కడి వరి ధాన్యం రాశులకు పూజలు నిర్వహించారు. పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా తమకు పూర్తిస్థాయిలో నీరు అందడంతో మంచి వరి దిగుబడులు సాధించామని అక్కడి రైతులు చెప్పారు. ఈ సందర్భంగా పెదపారుపూడిలో ప్రజలు మంత్రిని గ్రామానికి పిలిచి అభినందించారు. పొలం వద్దకు తీసుకెళ్లి మంత్రిచే ధాన్యం రాశుల వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది జూన్‌ మొదటి వారం నాటికి కృష్ణా జిల్లా ఖరీఫ్‌ సాగుకు పట్టిసీమ నీరు అందిస్తామని ఆయన అన్నారు. 2019 నాటికి ఎట్టిపరిస్థితుల్లో పోలవరం నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. అందుకు సంబంధించి ఈ నెల 31న ముఖ్యమంత్రి చేతులమీదుగా డయాఫ్రాం పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఉమా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనతో పాటు పెదపారుపూడి ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com