ధెరిసా మేకు సీటుకింద మేకు

బ్రిటన్‌లో థెరెసా మే ప్రభుత్వం రాజకీయ ఇబ్బందుల్లో చిక్కుకుంది. కొద్ది గంటల వ్యవధిలో ఇద్దరు క్యాబినెట్‌ మంత్రులు రాజీనామా చేశారు. ఐరోపా సంఘం (ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలిగే (బ్రెగ్జిట్‌) అంశంలో వ్యూహంపై విభేదాలే ఇందుకు కారణం. ఆదివారం రాత్రి బ్రెగ్జిట్‌ మంత్రి డేవిడ్‌ డేవిస్‌ అనూహ్యంగా రాజీనామా చేశారు. బ్రెగ్జిట్‌ అంశంలో ప్రధాన మంత్రి థెరిసాతో తనకు తీవ్ర విధానపర విభేదాలు ఉన్నాయని పేర్కొన్నారు. 28 సభ్యదేశాలతో కూడిన ఈయూ నుంచి వచ్చే ఏడాది మార్చి 29న బ్రిటన్‌ వైదొలగాల్సి ఉంది. తెగతెంపుల తర్వాత ఇరు పక్షాల నడుమ వాణిజ్యం ఎలా సాగాలన్నదానిపై ఇంకా అవగాహన కుదరలేదు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ విధానంతో తాను ఏకీభవించడంలేదని డేవిస్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ మంత్రి డోమ్నిక్‌ రాబ్‌ను బ్రెగ్జిట్‌ మంత్రిగా ప్రధాని ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిగంటలకు బ్రిటన్‌ విదేశాంగ మంత్రి బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేశారు. క్యాబినెట్‌లో బ్రెగ్జిట్‌ అనుకూల మంత్రుల్లో ఆయన ముఖ్యుడు. సోమవారం సాయంత్రం ఆయన రాజీనామాను ప్రధాని ఆమోదించారు. బ్రెగ్జిట్‌ ప్రణాళికపై పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని ప్రసంగించడానికి ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. థెరెసా తాజా వ్యూహాలపై జాన్సన్‌ గుర్రుగా ఉన్నారని వార్తలు వచ్చాయి. గత శుక్రవారం జరిగిన ఒక భేటీలో ఆయన వీటిపై గళం విప్పారు. తాజా రాజీనామాలతో అధికార కన్జర్వేటివ్‌ పార్టీలో రాజకీయాలు వేడెక్కాయి. థెరెసా వ్యూహాలను వ్యతిరేకిస్తున్న పలువురు ఎంపీలు ఆమెను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ 48 మంది ఎంపీలు.. శక్తిమంతమైన పార్టీ కమిటీకి లేఖలు సమర్పిస్తే నాయకత్వ మార్పిడికి బీజం పడుతుంది. ఇప్పటికే కొందరు లేఖలు సమర్పించినట్లు తెలుస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com