ధోనీపై ఎమ్మెస్కె అభిప్రాయం

ఎమ్మెస్కే ప్రసాద్‌.. అఖిల భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌. ఈ ఘనత అందుకున్న మొట్టమొదటి తెలుగువాడు. ఏడాదిన్నర క్రితం సెలక్టర్‌గా ఎంపికైన ఎమ్మెస్కే.. ప్రస్తుతం సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేస్తున్నాడు. అతని ఆధ్వర్యంలో ఎంపికైన టీమ్‌ఇండియా ఇటు టెస్టులు.. అటు వన్డేల్లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసింది. మహేంద్రసింగ్‌ ధోనీ కెప్టెన్సీకి తెరపడి.. పూర్తిస్థాయి సారథిగా విరాట్‌ కోహ్లి శకం మొదలైంది కూడా ఎమ్మెస్కే హయాంలోనే. క్రికెట్ కు సంబంధించి కొన్ని విషయాలను ప్రసాద్ ఓ ఇంటర్వు లో కుండ బద్దలు కొట్టాడు. సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఇప్పటివరకు నా ప్రయాణం సంతృప్తికరం. ఛైర్మన్‌ అయ్యాక టెస్టు, వన్డే సిరీస్‌లలో ఇంగ్లాండ్‌పై టీమ్‌ ఇండియా సంపూర్ణ ఆధిపత్యం మధురానుభూతే. ఇప్పటిదాకా మా నిర్ణయాలు, వాటి ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఆటగాళ్లు.. జట్టు యాజమాన్యం, కెప్టెన్‌లతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. ధోనిది ఎంత గొప్ప వ్యక్తిత్వమో ఒక్క మాటలో చెబుతా. బరోడాలో రంజీ మ్యాచ్‌ సందర్భంగా నాలుగు రోజులు కలిసే ఉన్నాం. నాలుగో రోజు సాయంత్రం వచ్చి ఒక మాట చెప్పాడు. ‘‘భారత్‌లో వేర్వేరు ఫార్మాట్లకు భిన్న సారథుల పద్ధతి పనిచేయదు. ప్రస్తుతం టెస్టుల్లో విరాట్‌ అద్భుతంగా సారథ్యం వహిస్తున్నాడు. పరిమిత ఓవర్ల జట్లకూ అతనే నాయకుడిగా ఉంటే బాగుంటుంది’’ అన్నాడు. అదే విషయాన్ని బీసీసీఐకి మెయిల్‌ చేశాడు. కెప్టెన్సీపై, కెరీర్‌పై ధోనికి పూర్తి స్పష్టత ఉంది. అతడికి ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. ఫిట్‌గా ఉన్నంతకాలం టీమ్‌ఇండియాలో ధోని తిరుగులేని ఆటగాడు. దేశానికి వెలకట్టలేని ఆస్తి అతను. గతం కంటే భిన్నంగా సీనియర్‌ ఆటగాళ్లతో వ్యవహరిస్తున్నాం. హైదరాబాద్‌లో రంజీట్రోఫీ మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు యువరాజ్‌సింగ్‌తో 40 నిమిషాలు మాట్లాడా. టీమ్‌ఇండియాకు ఎందుకు ఎంపిక చేయట్లేదు? ఏం చేస్తే తీసుకుంటాం? అందుకు ఏం చేయాలి? అన్న విషయాల్ని యువీతో కూలంకషంగా చర్చించా. గంభీర్‌, ధావన్‌లతో కూడా మాట్లాడా. జట్టులోకి ఎంపికవ్వకపోతే.. ఎందుకు తీసుకోలేదో వారికి గౌరవపూర్వకంగా తెలియజేయాలి. దేశం కోసం ఎంతో చేసిన వాళ్లను గందరగోళంలో నెట్టకూడదు. జూనియర్లతోనూ మాట్లాడుతున్నాం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com