ధ్యానం ఇలా చేయాలిరా అబ్బాయిలు

ధ్యానం అంటే ఏమిటో, ఎలాచేయాలో చాలామందికి తెలియదు. కళ్లు మూసుకుని కూర్చోవడమే ధ్యానం అను కునేవారులేకపోలేదు. ధ్యానంలో పలు స్థాయిలున్నాయి. ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి, శూన్యం వంటివి ఉన్నాయి. ధ్యానం అనేది మానసిక శక్తిని అంది స్తుంది.సాధికారతనిస్తుంది. శారీరక, మానసిక భావోద్వేగాల సమతుల్యతకు ఒక మేలైన సాధనంధ్యానం. ఏదైనాఒక వస్తువు మీదనో, శబ్దం మీదనో, విషయం మీదనో మనసును పూర్తిగాకేంద్రీకరించడమే ధ్యానం. ప్రస్తుత కార్పొరేట్‌ ప్రపంచంలో ఒత్తిడిని జయించేసులభ సాధనం ధ్యానమే. శరీరాన్ని, మనసును తేలిక పరుస్తుంది ధ్యానం.ఉద్రిక్తతలను ఉద్వే గాలను పారద్రోలుతుంది. మానసిక ప్రశాంతత నిస్తుందిధ్యానం. ఏకాగ్రత, జ్ఙాపకశక్తి, సృజనాత్మకత మెరుగయ్యేది ధ్యానం వల్లనే. ఇంట్లోఒక అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అక్కడ ప్రశాంతంగా కళ్లు మూసుకునికూర్చుని మెల్లగా శ్వాస తీసుకోవాలి. మన మనసును, ఆలోచనను శ్వాస మీదనే లగ్నంచేయాలి. ఇదే ధ్యానం చేసే పద్ధతి. మధ్యలో అంతరాయం కలిగించే ఆలోచనలను పక్కకునెట్టేయండి. మళ్లీ యథావిధిగా ధ్యానం చేసేందుకు ప్రయత్నించండి. మొదట 30 సెకన్లతో మొదలు పెట్టి నెమ్మదిగా సమయం పెంచుకుంటూ వెళ్ళాలి. ఇలా పది నుంచిపదిహేను నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ఇలా రోజూ ధ్యానం చేయడం వల్ల రోజంతాఉల్లాసంగా పనిచేయగలుగుతాం. అంతేకాదు ధ్యానం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.మనసును ఏకాగ్రం చేయడం వల్ల నిర్మాణాత్మకమైన ఆలోచనలకు దోహదం చేస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com