నక్కను మించిన జిత్తులమారి…చైనా!

చైనా దూత సాంగ్‌ టావో కయ్యాల మారి ఉత్తర కొరియాలో అడుగుపెట్టారు. చైనాలో ఈ మధ్య జరిగిన కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌ సమావేశం విశేషాలు, రెండు దేశాలకు ప్రయోజనకర అంశాలను వెల్లడించేందుకు అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ బదులుగా ఆయన ఆ దేశంలో పర్యటిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్‌ షాంగ్‌ వెల్లడించారు. ఈ పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘పెద్ద చర్య’గా అభివర్ణించారు. ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు ఒత్తిడి మధ్య కొనసాగుతున్న తరుణంలో సాంగ్‌ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఉత్తర కొరియా వరుసగా చేపడుతున్న అణు పరీక్షల గురించి ఆయన చర్చిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ప్రోద్బలంతో ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షల్లో భాగంగా ఆ దేశంతో ఎగుమతులు, దిగుమతులను చైనా తగ్గించుకున్న సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com