నగదు కొరతకు కారణాలు చెప్పండి

పార్లమెంటరీ స్థాయీ సంఘం ఎదుట ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఈ రోజు హాజరయ్యారు. సుమారు మూడున్నర గంటల పాటు స్థాయీ సంఘం సభ్యులు ఆయనను పలు అంశాలపై ప్రశ్నించారు. 2016 నవంబర్‌ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఇప్పటివరకు ఎంత నగదు తిరిగొచ్చిందో లెక్కలు చెప్పాలని స్థాయీ సంఘం ఆయనను ఆదేశించింది. అలాగే, దేశాన్ని కుదిపేసిన పీఎన్‌బీ కుంభకోణంపైనా ఆయనను ప్రశ్నించారు. ఇన్నేళ్ల నుంచి కుంభకోణం జరుగుతున్నా ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. ఏటీఎంలలో నగదు ఎందుకు సరిగా ఉంచలేకపోతున్నారు? నగదు కొరతకు ఎవరు కారణం? తదితర అనేక ప్రశ్నల్ని ఉర్జిత్‌పై కురిపించారు. అయితే, ఈ ప్రశ్నలన్నింటికీ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తానని ఉర్జిత్‌ స్థాయీ సంఘానికి స్పష్టంచేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com