నడుం మీద శంఖం

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇలియానా. తన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్‌లో చురుకుగా అడుగులు వేస్తోంది. తాజాగా రాజ్ కుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ సరసన ‘రెయిడ్’ సినిమాలో నటించింది ఇలియానా. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ గోవా బ్యూటీ.. అప్పట్లో టాలీవుడ్‌లో తనకెదురైన పలు ఆసక్తికర సంఘటనలను చెప్పుకొచ్చింది.‘‘నేను టాలీవుడ్‌లో మొదటిసారి సెట్స్‌పైకి వచ్చినపుడు నా నడుముపై శంఖం వేసి సన్నివేశాన్ని షూట్ చేశారు. ఇలా చేస్తున్నారేంటి అని దర్శకుడిని అడిగితే.. ‘నీ నడుము బాగుంది. ఈ సన్నివేశం షూట్ చేస్తే ఇంకా బాగుంటుంది’ అన్నారు. ఇలా నడుముపై తెరకెక్కిస్తున్న ప్రతీ సన్నివేశంలో అదే మాట చెప్పేవారు. దీంట్లో అసలు లాజిక్ ఏంటో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. ఇలాంటి సన్నివేశాలు చేయడం నాకస్సలు ఇష్టం ఉండదు. ఆ షాట్ ఎప్పుడు పూర్తవుతుందా అనే ఆలోచిస్తుంటా.. అయితే బాలీవుడ్‌లో మాత్రం నాకిలాంటి సంఘటనలు ఎప్పుడూ ఎదురవలేదు’’ అని చెప్పింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com