నడ్డి విరిచేశారు

కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార, విపక్ష పార్టీల విమర్శనాస్త్రాలు పదును తేలుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అత్యంత దారుణంగా ఉన్నాయని, దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా కుట్రపూరిత సిద్ధాంతాలను అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. బెంగళూరులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అధిక మొత్తాల్లో పన్నులు విధించి ప్రజల మీద మోయలేని భారం మోపుతున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశం మంచి వృద్ధి రేటుతో దూసుకెళ్లింది. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనుసరిస్తోన్న ఘోరమైన ఆర్థిక విధానాల వల్ల అది సగానికి పడిపోయింది. పెరిగిపోతున్న బ్యాంకింగ్ నేరాలు ఆ రంగం మీద ప్రజలకు నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది’ అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. సోమవారం ప్రధాని మోదీ నమో ద్వారా కర్ణాటక భాజపా యువమోర్చా కార్యకర్తలతో సంభాషించారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కూడా ఘర్షణను అంగీకరించదని ఆ సందర్భంగా వారికి వెల్లడించారు. మన హక్కుల కోసం ఇతరులతో వాదించాలి కానీ ఎట్టిపరిస్థితుల్లో కూడా సహనం కోల్పోకూడదని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా జాతీయ అధ్యక్షుడు కర్ణాటకలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పెరిగిన పెట్రోలు ధరలు కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించేందుకు జన్‌ ఆశీర్వాద్ యాత్ర పేరిట రాహుల్ తొమ్మిదో సారి కర్ణాటకలో సమావేశం నిర్వహించనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com