నన్ను అడగలేదు

ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా రాణించిన సీనియర్‌ నటి జయప్రద. తాజాగా చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్గా మారిన క్యాస్టింగ్‌ కౌచ్‌ (లైంగిక వేధింపులు) గురించి ఆమె మాట్లాడారు. ‘చిత్ర పరిశ్రమలో నేనెప్పుడూ క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కోలేదు. ఎందుకంటే నేను పాఠశాలలో చదువుతున్నప్పటి నుంచే నటిస్తున్నాను. నా సినిమాలు అన్ని బాక్సాఫీసు వద్ద హిట్‌ అయ్యాయి. కాబట్టి నేను పాత్రల కోసం ఒకరి దగ్గరికి వెళ్లి అడగాల్సిన అవసరం రాలేదు’. ‘ఇప్పుడు వందల మంది ముంబయికి వస్తున్నారు. చిత్ర పరిశ్రమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు టాప్‌ హీరో, హీరోయిన్‌ అయిపోవాలని కలలు కంటున్నారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ పెరిగిపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో రాణించాలి అనుకుంటున్న నటీమణుల జీవితాలు చాలా మారాయి’. ‘మా రోజుల్లో ‘మా కూతుర్ని సినిమాల్లోకి పంపిస్తామా?’ అనేవారు. కానీ, ఇప్పటి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో పనిచేసేందుకు వారికి శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు’ అని ఆమె చెప్పారు. అనంతరం రాజకీయ రంగంలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందా? అని జయప్రదను ప్రశ్నించగా ఆమె సమాధానం ఇచ్చారు. అవకాశాలు ఎక్కడ ఉంటాయో.. అక్కడ వేధింపులు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com