నన్ను క్షమించమ్మా!

జమ్ముకశ్మీర్‌లోని కతువాకు చెందిన ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమల్‌హాసన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నారి బాలికను కాపాడడంలో విఫలమయ్యారని, ఆమె పట్ల జరిగింది అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు. ఆమెను కాపాడలేకపోవడంపై మనిషిగా, తండ్రిగా, పౌరుడిగా చాలా కోపంగా ఉందని కమల్‌ ట్వీట్‌ చేశారు. ఆమె మీ సొంత కుమార్తె అనుకుంటే జరిగింది ఎంత దారుణమో అర్థమవుతుందని అన్నారు. ‘ఈ దేశాన్ని నీకు సురక్షితమైన ప్రాంతంగా ఉంచలేకపోయాం.. ఐ యామ్‌ సారీ మై చైల్డ్‌ . కనీసం భవిష్యత్తులో నీలాంటి చిన్నారులకు ఇలా జరగకుండా ఉండేందుకు న్యాయం కోసం పోరాడుతాను. నీ విషయంలో చాలా బాధపడుతున్నాం, నిన్ను ఎప్పటికీ మర్చిపోలేము’ అని కమల్‌ హాసన్‌ ట్వీట్‌లో వెల్లడించారు. కతువా బాలికపై సామూహిక అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు గత రాత్రి దిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జనవరిలో ఎనిమిదేళ్ల కతువా బాలికను కొందరు వ్యక్తులు అపహరించి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడి తర్వాత ఆమెను హత్య చేసి సమీపంలోని అడవిలో పడేసిన సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com