నన్ను రేప్ చేయలేదు

బాలీవుడ్‌ షెహెన్‌షా అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘పింక్‌’ చిత్రంలో తాప్సి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అత్యాచార బాధితురాలి పాత్రని పోషించానని తాప్సి ఇంటర్య్వూలో చెప్పినట్లు ఓ పత్రిక ప్రచురించింది. అయితే దీన్ని ఆమె సోషల్‌మీడియా వేదికగా ఖండించారు. ‘నో, ‘పింక్‌’లో నేను అత్యాచార బాధితురాలి పాత్రను పోషించలేదు! లేదా నేను ఈ ఇంటర్వ్యూ ఇవ్వలేదు! బాధ్యతగల జర్నలిజంకు ఏమైంది’ అని తాప్సి ట్వీట్‌ చేశారు. ‘పింక్‌’ చిత్రానికి అనిరుద్ధరాయ్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మీశర్మ, సూజిత్‌ సర్కార్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 16న ‘పింక్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com