నలుగురికి తప్ప సిట్టింగ్ అందరికీ టికెట్లు ఇస్తా


ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌ల్లో ముగ్గురు నలుగురికి తప్ప అందరికీ తిరిగి టిక్కెట్లు ఇస్తానని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. నేడు కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బొడిగె శోభా, గంగుల కమలాకర్‌లపై కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. పద్దతి మార్చుకోవాలని వారికి సూచించారు. శాసన సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో 106సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ‌ ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com