నలుపు రంగులో కోడి మాంసం. ఔషధాలు అద్భుతం.

అరుదైన ఔషధ గుణాలున్న కోడి కడక్‌నాథ్‌ కోడి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబూవా, ధర్‌ జిల్లాల్లో బిల్‌, బిలాల తెగలవారు వీటిని ఎక్కువగా పెంచుతారు. పోషకాల గనిగా పిలిచే ఈ కోళ్ల పెంపకం రైతుల ఆదాయాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు. కడక్‌నాథ్‌ కోడికి మరో పేరు ‘కాలిమసి’. అంటే దీని మాంసం నలుపు రంగులో ఉంటుంది. మాంసం రుచిగా, నలుపు రంగులో ఉండి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ‘మెలనిన్‌’ అనే పిగ్మెంట్‌ వల్ల దీని మాంసం నలుపు రంగులో ఉంటుంది. ఈ కోడి మూడు రంగుల్లో లభిస్తుంది. అవి జెట్‌ బ్లాక్‌, పెన్సిల్‌, గోల్డెన్‌. కడక్‌నాథ్‌ కోడి మాంసంలో 25 శాతం మాంసకృత్తులు ఉంటాయి. బాయిలర్‌ కోడి మాంసంతో పోలిస్తే కడక్‌నాథ్‌ కోడిలో కొలెస్టరాల్‌ తక్కువగా ఉంటుంది. దీని మాంసంలో 18 రకాల అమైనో ఆసిడ్స్‌, విటమిన్లు (బి1, బి2, బి3, బి12), కాల్షి యం, ఫాస్ఫరస్‌, ఐరన్‌ నికోటినిక్‌ ఆసిడ్స్‌ ఉంటాయి.సెంట్రల్‌ ఫుడ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, మైసూర్‌ వారు దీని ఔషధ గుణాలపై పరిశోధనలు చేశారు. కడక్‌నాథ్‌ కోడి మాంసం హృద్రోగులకు మేలు చేయడమే కాకుండా గుండెకు రక్త సరఫరా పెంచుతుంది. కడక్‌నాథ్‌ కోడి మాంసం హోమియోపతిలో, నరాల సంబంధిత వ్యాధులను నయం చేయడానికి వాడతారు. గిరిజనులు కడక్‌నాథ్‌ కోడి రక్తాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు. వయాగ్రాలోని సిల్డెనాఫిల్‌ సిట్రిక్‌ రక్త సరఫరా పెంచడం ద్వారా సెక్స్‌ సామర్థ్యం పెంచుతుంది.కడక్‌నాథ్‌ మాంసంలోని ‘మె లనిన్‌’ పిగ్మెంట్‌ కూడా సరిగ్గా అదే పని చేస్తుంది. కడక్‌నాథ్‌ కోడి మాంసం హార్మోన్లు, పిగ్మెంట్స్‌, అమైనో ఆసిడ్స్‌ మానవ శరీరంలోని రక్త కణాలను, హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతాయి. నలుపు రంగు మాంసం క్షయ వ్యాధి, గుండె సంబంఽధ వ్యాధులు, నరాల సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. స్త్రీలలో గర్భకోశ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో కడక్‌నాథ్‌ కోడి మాంసం బాగా పనిచేస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com