నష్టం=5వేల కోట్లు

ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకు నాలుగో త్రైమాసికంలో నష్టాలను చవి చూసింది. మార్చి31తో ముగిసిన త్రైమాసికానికి రూ. 5,662.76కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలోని ఇదే త్రైమాసికంలో ఈ బ్యాంకు రూ. 3,199.77కోట్లు నష్టపోయింది. 2018లో జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ బ్యాంకు ఆదాయం రూ.7,913.82కోట్లుగా ఉంది. గతేడాది కంటే స్వల్ప ఆదాయం ఆర్జించింది. 2016-17 జనవరి-మార్చి త్రైమాసికంలో రూ. 7,702.9కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. అయితే ఈ బ్యాంకు నిరర్ధక ఆస్తుల విలువ మాత్రం భారీగా పెరిగింది. 2017 ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో రూ. 6,054.39కోట్లు ఉన్న ఎన్‌పీఏ విలువ ఈ ఏడాది నాలుగో త్రైమాసికానికి రూ.10,773.30కోట్లకు చేరింది. ఇక మొండి బాకీల విలువ కూడా అదే స్థాయిలో పెరిగింది. 2017మార్చి 31 నాటికి రూ.44,752కోట్లు ఉన్న మొండి బకాయిలు ఈ త్రైమాసికానికి రూ.55,588.26కోట్లకు చేరాయి. శుక్రవారం నాటికి ఐడీబీఐ షేర్ల విలువ కూడా 2.38శాతం మేర పతనమైంది. రూ.1.60 తగ్గి రూ.65.50కు చేరుకుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com