నాకు ఏపీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది

దర్శకుడు గుణశేఖర్‌ తన దర్శకత్వంలో విడుదలైన ‘రుద్రమదేవి’ చిత్రానికి ప్రోత్సాహక నగదు అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. 2015 అక్టోబరు 9న ప్రపంచ వ్యాప్తంగా నాలుగు (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం) భాషల్లో విడుదలైన ‘రుద్రమదేవి’కి పన్ను రాయితీ కోరుతూ దరఖాస్తు పూర్వకంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని, తొలుత సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదని తెలిపారు. చిత్రం విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో దరఖాస్తు చేసుకున్నామని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణమే స్పందించి తెలంగాణలో వినోదపు పన్ను రాయితీ కల్పించారని తెలిపారు. తన దరఖాస్తుని పునఃపరిశీలించి ఇప్పటికే ‘రుద్రమదేవి’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌లో వసూలు చేసిన వినోదపన్ను మొత్తానికి సమానమైన ‘ప్రోత్సాహక నగదు’ని అందజేయాలని కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com