నాకు వరుడు కావలెను

మనకు ఫేస్‌బుక్‌ అంటే ఫొటోలు,వీడియోలు షేర్‌ చేసుకోవడానికి, రకరకాల పోస్ట్‌లు చేయడానికి వాడుతుంటాం. ఇంకా కుదిరితే చాటింగ్‌లూ చేస్తుంటాం. కానీ ఓ యువతి మాత్రం దానిని వినూత్నంగా ఉపయోగించుకొని తన పోస్ట్‌తో అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి సంబంధించి వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్ మారింది. కేరళలోని మలప్పురానికి చెందిన జ్యోతి అనే యువతి తన జీవిత భాగస్వామిని వెతుక్కోవడానికి ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకుంది. గతవారం పేస్‌బుక్‌ ఖాతాలో ‘హ్యాష్‌ట్యాగ్ ఫేస్‌బుక్‌ మ్యాట్రిమోని’ పేరుతో ఆమె గురించి ఓ ప్రకటన ఇచ్చింది. మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్స్‌లో ఉండే వివరాలన్నీ అందులో వివరించింది. ‘ నేను ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నాను. కులం, జాతకం పట్టింపులు లేవు. నా వయసు 28. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో బిఎస్సీ చేశాను. నాకు తల్లిదండ్రులు లేరు. సోదరుడు ముంబయిలో ఉద్యోగం చేస్తున్నారు. సోదరి సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. నాకు ఎలాంటి డిమాండ్లు లేవు’ అని అందులో తన పూర్తి వివరాలు మలయాళంలో రాసింది. ఏప్రిల్‌ 26న చేసిన ఆమె పోస్ట్‌కు 6000 వేలకుపైగా షేర్లు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఇప్పటికే ఆమెకు కొన్ని పెళ్లి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఆమె ఆ ప్రకటనతో పాటు ఫేస్‌బుక్‌ సీఈఓకు ఓ అభ్యర్థన కూడా చేసింది. ‘హ్యాష్‌ట్యాగ్‌ ఫేస్‌బుక్‌ మ్యాట్రిమోని’ అనే ఆప్షన్‌ను అందుబాటులోకి తేవడం వల్ల జీవిత భాగస్వామిని వెతుక్కోవడం సులభం అవుతుందని ఓ ప్రతిపాదన చేసింది. ఇలాంటి సదుపాయాల వల్ల మధ్యవర్తులు, మ్యాట్రిమోని వెబ్‌సైట్ల చేతుల్లో చిక్కుకొని డబ్బు కోల్పోకుండా ఉంటారని సూచించింది. ఈ కొత్త విధానాల వల్ల కులం, జాతకాలు అంటూ తిరిగే వారు కొంతమేర మారే అవకాశం ఉంటుందని వివరించింది. తన స్నేహితులను కూడా ఇలాగే చేయమని సలహా ఇచ్చింది. భాగస్వామి కోసం ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకున్న వారిలో జ్యోతితో పాటు గతంలో కేరళకు చెందిన రంజీష్ మంజేరీ అనే ఫొటోగ్రాఫర్‌ కూడా ఉన్నారు. అతడు ఫేస్‌బుక్‌ ద్వారానే లైఫ్‌ పార్టనర్‌ను వెతుక్కొని ఈ మధ్యనే పెళ్లి కూడా చేసుకున్నాడు. అలాగే జ్యోతి యాడ్‌ను షేర్‌ చేసిన వారిలో ఆయన కూడా ఉన్నారు. జ్యోతి అభ్యర్థనను జుకర్‌ బర్గ్ విన్నాడో లేదో తెలీదు కానీ ఫేస్‌బుక్‌ కొత్తగా డేటింగ్ గేమ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com