నాగ్ అభిమానులు ఒప్పుకోరు

నాగార్జున కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం ‘మన్మథుడు’. అందులో నాగ్‌ పాత్ర చిత్రణ, తను పేల్చిన పంచ్‌లు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. ఆ పాత్రని మరోసారి చూడబోతున్నామా? అవుననే అనిపిస్తోంది. అయితే ఈసారి ‘మన్మథుడు’గా కనిపించబోతోంది నాగ్‌ కాదు… ఆయన వారసుడు అఖిల్‌. ‘మన్మథుడు’లోని కథానాయకుడి పాత్రని ప్రేరణగా చేసుకొని ఓ స్క్రిప్టు తయారవుతోందని తెలుస్తోంది. ‘మన్మథుడు’ కథకీ.. దీనికి సంబంధం లేకపోయినా కథానాయకుడి పాత్ర మాత్రం అలానే ప్రవర్తిస్తుందట. అంటే.. ఈ సినిమాని ‘మన్మథుడు 2’ అనుకోవొచ్చన్నమాట. ప్రస్తుతం అఖిల్‌ తనకు తగిన కథల వేటలో ఉన్నాడు. అందులో భాగంగానే ఈ తరహా స్క్రిప్టు ఒకటి రెడీ అవుతోందని తెలుస్తోంది. ‘మన్మథుడు’ కథని అందించింది త్రివిక్రమ్‌. మ‌న్మ‌థుడు 2 చిత్రానికి ఆయ‌న దర్శకత్వం వహిస్తారా? అనే ఆసక్తి నెలకొంది. అఖిల్‌ తొలి సినిమా కోసం పరిశీలించిన దర్శకుల జాబితాలో త్రివిక్రమ్‌ పేరు కూడా వినిపించింది. ఆ కాంబినేషన్‌ ఇలా సెట్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com