నాటి సమర్థత నేడు ఏమైంది?

ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గత తొమ్మిదేళ్ల పాలనకు.. ప్రస్తుత పాలనకు మధ్య పొంతన లేకుండా పోతోందని భాజపా ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. సమర్థమైన అవినీతి పరిపాలన ప్రస్తుతం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని అంతర్గత శక్తుల ప్రభావం ఇప్పుడు చంద్రబాబు పాలనపై పడుతోందని దుయ్యబట్టారు. కేంద్రమంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్న సమయంలో రాష్ట్రానికి ఏడు లక్షల ఇళ్లను మంజూరు చేశారని, వాటిలో మూడు లక్షల ఇళ్లు నగర ప్రాంతాల్లో ఇంకా నిర్మించలేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు పూర్తిగా ఖర్చు చేయలేదన్నారు. ఈ పథకంలోనూ వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. నీరు- చెట్టు చెట్టు కార్యక్రమంలో రూ.13 వేల కోట్లు అవినీతి జరిగిందని వీర్రాజు అన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను నిలువరిస్తామంటూ సీఎం స్వయంగా ప్రకటన చేసినా పట్టించుకునే వారే లేరని విమర్శించారు. సర్వశిక్షా అభియాన్ పథకానికి కేంద్రం నుంచి ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయలు వస్తోందని, ఆ నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో రూ.30 వేల కోట్లు విద్యకు కేటాయిస్తున్నారని, ఈ నిధులన్నీ ఏమవుతున్నాయని ప్రశ్నించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా, సమర్ధుడిగా చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటూ ఎద్దేవా చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com