నాట్స్ ముగింపు రోజు చిత్రాలు


ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్‌) అయిదవ అమెరికా తెలుగు సంబరాలను ఘనంగా నిర్వహించింది. చికాగోలోని షాంబర్గ్‌ వేదికగా జరిగిన ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు విచ్చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సంబరాలు తెలుగు వారిని ఉత్తేజపరిచేలా నిర్వహించారు. ఈ సంబరాలకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, రాజకీయ వేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, సాహిత్య, సంగీత కళాకారులు విచ్చేశారు. రుద్ర శంకరం, అన్నమాచార్య కీర్తనలు, సౌండ్‌ ఆఫ్‌ ఇషా, వెంకటాచల నిలయం, బాల రామాయణం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రవాసులు సంబరాల వేదికపై బతుకమ్మ ఆడారు. అమెరికాలో ఏడేళ్ల తెలుగు బాలుడు ఆకాశ్‌ వూకోటితో స్పెల్‌ బీ పై నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు నాటకాలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు సినీ తారల సందడి కూడా అమెరికాలోని తెలుగువారికి మధురానుభూతులు పంచాయి. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌, నిఖిల్‌, సాయికుమార్‌, అలీ, సుబ్బరాజు, పూజా హెగ్దే, బుల్లి తెర నటీ నటులు సంబరాల్లో సందడి చేశారు. గాయని సునీత, వందేమాతరం శ్రీనివాస్‌లు పాడిన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. జబర్దస్త్‌ టీమ్‌ సంబరాల్లో పువ్వులు పూయించింది. అనేక రంగాల్లో రాణిస్తూ తెలుగు జాతికి వన్నె తెచ్చిన వారిని నాట్స్‌ సంబరాల వేదికపై ఘనంగా సన్మానించారు. ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు, పద్మభూషణ్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కలెక్టర్‌గా పనిచేసి అద్భుత పనితీరులో రాష్ట్రపతి పురస్కారాలు అందుకున్న పిరికిపండ్ల నరహరి తదితరులను నాట్స్‌ సన్మానించింది. ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది తెలుగువారు ఈ నాట్స్‌ సంబరాల్లో పాల్గొన్నారు. తదుపరి నాట్స్‌ సంబరాలు 2019లో సియాటెల్‌లో, 2021 సంబరాలు న్యూజెర్సీలో జరగనున్నాయని నాట్స్‌ ఛైర్మన్‌ సామ్‌ మద్దాలి ప్రకటించారు. ఎప్పటి లాగే ఈ రాబోయే నాట్స్‌ సంబరాల్లో పాల్గొనాలని అందరికీ పిలుపునిచ్చారు. రేవంత్‌, సునీత, వందేమాతరం శ్రీనివాస్‌, సాయికుమార్‌ తదితరులు పాడిన ‘పుణ్యభూమి నాదేశం నమో నమామి’పాటతో సంబరాలు ముగిశాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com