నాట్స్-సౌత్‌ఫోర్క్ డెంటల్ ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన


ఉత్తరఅమెరికా తెలుగుసంఘం(నాట్స్) సంస్థ ఇర్వింగ్ పట్టణంలో సౌత్‌ఫోర్క్ డెంటల్ క్లినిక్‌లో ఏప్రిల్ 29, ఆదివారం నాడు ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించింది. ఈ ఉచిత వైద్యశిబిరంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖ వైద్యులు, మూడువందలమందికి పైగా ప్రవాసాంధ్రులకు వైద్యపరీక్షలు చేసి తమ సలహాలు, సూచనలు అందించారు. మధుమేహము మరియు రక్తపోటు ఉన్నవారికి ప్రత్యేక పరీక్షలు చేసి, వారికి పౌష్టికాహారం, ఆహారపుటలవాట్లు, ఆరోగ్య జీవనశైలి ఆవశ్యకతను వివరించారు. ఇన్సూరెన్స్ సౌకర్యం లేనివారికి, ఇండియానుండి తమ పిల్లలవద్దకు విజిట్‌కి వచ్చిన తల్లిదండ్రులకు ఈ ఉచిత వైద్యశిబిరం బాగా మేలు చేసింది. ఇండియానుండి ఆరోగ్యసమస్యలతో వచ్చినవారికి, వాటిమీద సెకండ్ ఒపీనియన్ అందించడం, మందుల్ని అడ్జస్ట్ చేయడంవంటి సలహాలు అందించారు. ఈ శిబిరానికి వచ్చి సేవలు ఉపయోగించుకొన్న మధుమేహ రోగులకు ఉచితంగా గ్లూకోమీటర్లు కూడా పంపిణీ చెశారు. ఈ శిబిరంలో డా. కిషోర్ ఎలప్రోలు , డా. వందన మద్దాలి, డా. రాజు కోసూరి (కార్డియాలజిస్ట్), డా. దీపిక కోయ (గాస్ట్రొ ఎంట్రాలజిస్ట్), డా. శ్రీదేవి గుత్తికొండ (ఎండోక్రైనాలజిస్ట్), డా యోగి చిమటా (నెఫ్రాలజిస్ట్), డా శిల్ప దండా (నెఫ్రాలజిస్ట్), డా లత వేలుస్వామి (నెఫ్రాలజిస్ట్) డా. బిందు కొల్లి (డెంటిస్ట్) పాల్గొని తమ సేవలందించారు. ఫ్లవర్‌మౌండ్ ఇర్వింగ్ ఇండియన్ సెంటినియల్ లయన్స్ క్లబ్‌వారు విజన్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహీంచారు. ఈ వైద్యశిబిరానికి నాట్స్ సంస్థ నుండి సమన్వయకర్తలుగా వెంకట్ కొల్లి, కిషోర్ కంచర్ల, జ్యోతి వనం, అజయ్ గోవాడ వ్యవహరించగా,టాంటేక్స్ సంస్థ నుండి ప్రెసిడెంట్ కృష్ణవేణి శీలం, ప్రెసిడెంట్-ఎలక్ట్ చినసత్యం వీర్నాపు, వైస్-ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి కోడూరు కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. విద్యార్థి వాలంటీర్లుగా ప్రణీత్ మన్నె, తన్వి కొంగర, పూజ కొల్లి, విష్ణు అర్థుం, రాహుల్ బట్లంకి, హర్షిత్ వనం,సాహస్ చిన్ని, నిఖిల్ గుడ్డాటి, ఆశ్లేష్ మరిపల్లి, అనూహ్య మొరవనెని, శ్రీహిత్ మొరవనెని, విక్రాంత్ కొల్లి, అను బోయపాటి, శ్రేయస్ గున్న,అభిరాం గద్దె పాల్గొన్నారు. డా. బిందు కొల్లిగారు మాట్లాడుతూ ఈ శిబిరం ఇంత విజయవంతం కావటానికి సహకరించిన వైద్యులు అందరకూ,ఇక్కడకు విజిట్‌కి వచ్చి ఉన్న తల్లి తండ్రులలో ఈ వైద్య శిబిరం గురించి ప్రచారం కల్పించిన నాట్స్ వాలంటీర్స్ నాగరాజు తాడిబోయిన,శ్రీలక్ష్మి మండిగ లకు మరియు ఈ శిబిరం విజయవంతం అవటానికి కారణం అయిన మురళి వనం, రామకృష్ణ నిమ్మగడ్డ, సుబ్బారావు పొన్నూరు, రామక్రిష్ణ కోగంటి, క్రిష్న కోరాడ, భాను లంక, మంజు నందమూడి, తులసి దేవభక్తుని, దీప్తి దేవభక్తుని లకు, ప్రత్యేక శ్రద్ద తీసుకొని మీడియా తరుపున ప్రచారం లో సహకరించిన కె సి చేకురి, సుబ్బారెడ్డి నరపాల తమ ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ మరియు సౌత్‌ఫోర్క్ డెంటల్ సంస్థలు ఇటువంటి మెడికల్ క్యాంపులను తరచూ నిర్వహించడం ద్వారా ఇన్సూరెన్స్ సౌకర్యంలేని తమకు నిష్ణాతులైన వైద్యులతో వైద్యసహాయాన్ని అందించడంపట్ల ఈ ఉచిత వైద్యసేవలను పొందిన తల్లిదండ్రులు, ప్రవాసాంధ్రులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ శిబిరం నిర్వహణలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్), మెట్రో తమిళ సంఘం సహకరించాయి. ఈవెంట్ స్పాన్సర్లుగా సౌత్‌ఫోర్క్ డెంటల్ వ్యవహరించాయి.
tags: nats free health camp pictures, tnilive telugu news international, kolli bindu, southfork dental

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com