నాడు తండ్రికి…నేడు తనయుడికి సేవలు

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ సలహాదారు శ్యామ్‌ పిట్రోడా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కోసం పని చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే గుజరాత్‌లో ఐదు రోజులు పర్యటిస్తారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో రూపకల్పనకు సమాచారం సేకరించేందుకు వడోదరా, అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌, జామ్‌ నగర్‌, సూరత్‌లో ప్రజలతో మమేకం కానున్నారు. విద్య, వైద్యం, సూక్ష్మ మధ్య తరహా సంస్థలు, ఉద్యోగ కల్పన, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలతో ప్రజా మేనిఫెస్టో రూపకల్పనకు రాహుల్‌ తనను నియమించారని పిట్రోడా విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకే ఇక్కడికి వచ్చానన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com