నాపై దాడి జరిగితే తదనంతర పరిణామాలు బాగోవు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ మాలకొండయ్యకు లేఖ రాశారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ ఎదురుగా బుధవారం జరిగే జనసేన ఆవిర్భావ సభకు భద్రత కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై దాడి జరిగితే ప్రజాజీవితంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గతంలో భీమవరంలో ఫ్లెక్సీ చింపివేసినందుకే అభిమానులు ధర్నా చేశారని, శాంతిభద్రతల సమస్యగా మారిందని పవన్‌ గుర్తుచేశారు. ఇటీవల అనంతపురం పర్యటనలో తొక్కిసలాట ఘటన దృష్ట్యా తాను భద్రత కోరుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. భద్రతకు పోలీసులు నిస్సహాయత ప్రకటిస్తే.. రాష్ట్రంలో పర్యటన సమయంలో అనివార్యమైన సంఘటనలు ఏమైనా జరిగితే వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పవన్‌ స్పష్టంచేశారు. మార్చి 14 తర్వాత కూడా తనకు అందిస్తున్న వ్యక్తిగత భద్రతను కొనసాగించాల్సిందిగా పవన్‌ డీజీపీని కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com