నామం కుసుమ. ఆహారం గుప్పిళ్ళ కొద్దీ ఇసుక.

వారణాశికి చెందిన కుసుమావతి అనే మహిళ ప్రతి రోజూ రెండు కేజీల ఇసుక తింటోందట. ఇసుక తినడం వల్లే 78ఏళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని తన ఫిట్‌నెస్‌ రహస్యం చెప్పింది ఈ బామ్మ. కుసుమ 15ఏళ్ల వయసులో ఇసుక తినడం ప్రారంభించింది. అంటే సుమారు 63ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి రోజు రెండు కేజీల ఇసుక తింటోందన్నమాట. ఇసుక తినడం ప్రారంభించినప్పుడు మొదట్లో కడుపు నొప్పి బాధించిందని, ఆ తర్వాత తగ్గిపోయిందని తెలిపింది. ఇప్పటికీ రోజులో కొంత సమయాన్ని కేటాయించి తానే స్వయంగా ఇసుక సేకరించుకుంటోంది. ఇసుక దొరక్కపోతే ఇంటి గోడ పగలగొట్టి అదే తినేస్తుందట. ఇదంతా రోజూ గమనిస్తున్న స్థానికులు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇసుక తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారనేది అవాస్తవమని.. ఇది తినడం వల్లే ఈ వయసులోనూ ఇంత ఆరోగ్యంగా ఉన్నానని కుసుమ చెబుతోంది. పొట్టలో కానీ, నోట్లో కానీ తనకి ఇప్పటివరకు ఎలాంటి సమస్య తలెత్తలేదని, ఇప్పుడైనా దంతాలతో గట్టి రాళ్లను సైతం ఎంతో సులువుగా కొరికేస్తానని నవ్వుతూ చెప్తోంది. అంతేకాదు ఇసుక తినడం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండవని చెప్పింది. ఈ వయసులోనూ ఆమె వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. పని నుంచి విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన తనకి ఇప్పట్లో లేదని వివరించింది. ఈ వయసులోనూ అలుపులేకుండా పని చేసేందుకు.. ఇసుకలో ఉన్న ఖనిజాలే కారణమని తెలిపింది. ఇప్పటివరకు వైద్యుడ్ని కలవాల్సిన అవసరం రాలేదని, మనవళ్లు, మనవరాళ్లు ఇసుక తినడం ఆపాలని కోరుతున్నారని, కానీ తాను ఆ అలవాటు మార్చుకోలేనని తేల్చి చెప్పేసింది. అంతేకాదు వైద్యుడ్ని సంప్రదించి ఈ అలవాటు మానేలా చర్యలు చేపడతామని వారు కోరినా తనకు అవసరం లేదంది ఈ బామ్మ.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com