నారింజ చేస్తుంది నాజుగ్గా

నారింజ పండులో ఆరోగ్యానికి ఉపయోగకరమైన అనేక పోషక విలువలున్నాయి. నారింజ పండు తోలు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నారింజ తోలుతో ఫేస్‌ప్యాక్స్ తయారు చేసుకుని అందాన్ని సొంతం చేసుకోవచ్చు.
*నారింజ తొక్కకు, కొద్దిగా నీరు కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రపరచాలి. ఇలా చేస్తుంటే కొన్ని వారాల తర్వాత చక్కటి ఫలితం కలుగుతుంది.
*ఒక బౌల్లో రెండు టీ స్పూన్ల పెరుగు, ఒక టీ స్పూన్ నారింజ తొక్కల పౌడరు వేసి కలపాలి. ఈ మిశ్రమంతో ముఖం పైన నల్లమచ్చలు ఉండే ప్రాంతాన్ని మసాజ్ చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల నల్లమచ్చలు పోతాయి.
*ఒక బౌల్లో నారింజ తోలు పౌడరు, పెరుగు ఒక టీస్పూన్ చొప్పున తీసుకుని, అందులో అర టీ స్పూన్ తేనె వేయాలి. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని ముఖంపై పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయటం వల్ల నల్లటి వలయాలు త్వరగా తగ్గిపోతాయి. ఒక వేళ మీ చర్మం పొడిచర్మం అయితే ఆ మిశ్రమంలోకి నాలుగు చుక్కల ఆలివ్ నూనెను వేసుకోవటం మర్చిపోకండి.
*ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ తేనెను, ఆరెంజ్ పీల్ పౌడర్, నిమ్మరసం అర స్పూన్ తీసుకోవాలి. దీన్ని మిశ్రమంగా కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. దీని వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
మొదట ఒక ఆరెంజ్ తొక్కను పేస్ట్‌గా చేసుకోవాలి. అందులోకి పసుపు, తేనెను అర టీ స్పూన్ చొప్పున వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే ముఖ కండరాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి నుంచి రిలీప్ అవుతారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com