నార్త్ ఈస్ట్ తెలుగు సంఘ ఉగాది ఉత్సవాలు

నార్త్‌ ఈస్ట్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల ఇంగ్లాండ్‌లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. సురేఖ జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో మేడంగి పరమేశ్వరన్‌ ఉగాది పచ్చడి విశిష్టత గురించి అందరికి తెలియచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లార్డ్‌ మేయర్‌ గ్రాహం మాట్లాడుతూ… వివిధ దేశాలకు చెందిన ప్రజలు నగరానికి రంగవల్లులు అద్దుతున్నారన్నారు. అనంతరం ఆయనను డా.కె.వి.రావు సన్మానించారు. నిర్వాహకులు మధు అడాల మాట్లాడుతూ… తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియచేయడానికే ఈ ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com