నాలుగేళ్లు అంతే!

పోలవరం ప్రాజెక్టును కేంద్రమైనా చేపట్టాలి లేదా పూర్తిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులైనా ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం పార్లమెంటు సభ్యులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలిపారు.ముంపు మండలాలను ఏపీలో కలిపిన కేంద్రం పోలవరం పూర్తిచేయడంలో కూడా అంతే చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరానికి రూ.2218 కోట్లు ఖర్చు పెట్టిందన్న బాబు కేంద్రం నుంచి ఆ నిధుల్ని రీ ఎంబర్స్ చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుపై వున్న పర్యావరణ ఆంక్షలన్నీ శాశ్వతంగా రద్దుచేయాలని సీఎం చంద్రబాబు కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com