నిజంగా!?

రిచా గంగోపాధ్యాయ… పేరు గుర్తుందా..? లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ఎన్నారై బ్యూటీ. ఎక్కడో అమెరికాలోని డెట్రాయిట్‌లో ఉన్న రిచాను తన సినిమాతో తెలుగు వాళ్లకి పరిచయం చేశాడు శేఖర్ కమ్ముల. లీడర్ తర్వాత మిరపకాయ్, మిర్చి, భాయ్‌లాంటి సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. తమిళ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత అకస్మాత్తుగా మాయమైపోయింది ఈ అందాలతార. తన స్వస్థలం అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడే హాయిగా చదువుకుంటోంది. ఈ మధ్యే చాలా రోజుల తర్వాత ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది రిచా. తన నెక్స్ సినిమాపై అభిమానులు అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది ఈ ముద్దగుమ్మ. ఇకపై తాను సినిమాలు చేయనని తేల్చిచెప్పేసింది రిచా. రెండేళ్ల కింద మిర్చితోనే తన కెరీర్ ముగిసిపోయిందని తెలిపింది ఈ భామ. సినిమాల్లోకి తాను రావడం అనేది అనుకోకుండా జరిగిందనీ… తన కెరీర్ షార్ట్ అండ్ స్వీట్ అని చెప్పేసింది ఈ బ్యూటీ. కొన్నాళ్లు సినిమాల్లో నటించాలనుకున్నాను… నటించానంతే. ఇకపై సినిమాలు చేసేది లేదని తేల్చేసింది రిచా గంగోపాధ్యాయ.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com