నిజాం కుమారుడు మరణం

ఏడో నిజాం కుమారుడు నవాబ్‌ ఫజల్‌జహా బహదూర్‌(72) ఆదివారం హైదరాబాద్‌ కింగ్‌కోఠిలోని తన నివాసంలో కన్నుమూశారు. హైదరాబాద్‌ స్టేట్‌ చివరి పాలకుడైన ఏడో నిజాం మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌, సాహెబా లీలాబేగం దంపతులకు ఆయన 1946 ఫిబ్రవరి 29న జన్మించారు. గత కొంతకాలంగా ఫజల్‌జహా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇన్నాళ్లూ ఆయన నిజాంకు సంబంధించిన వివిధ ట్రస్టుల వ్యవహారాలు చూసుకున్నారు. సౌదీ అరేబియాలో హజ్‌ యాత్రికుల బస కోసం నిజాం నిర్మించిన అతిథిగృహం ‘హైదరాబాద్‌ రుబాత్‌’ వ్యవహారాల బాధ్యతలనూ నిర్వహించారు. ఆయనకు భార్య సాహెబ్‌జాదీ దర్వేరున్నీసాబేగం, తనయుడు ఉన్నారు. ఫజల్‌జహా భౌతిక కాయానికి కింగ్‌కోఠిలోని పూర్వీకుల సమాధుల పక్కన అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com