నిజాయతీకి-నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. గాంధేయవాది చేకూరి కాశయ్య.


దిగజారుతున్న నేటి రాజకీయాల్లోను, రాజకీయ వేత్తల్లోను మార్పు రాకుండా ప్రపంచంలోనె పెద్దదైన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయం అంటే దోపిడీ కాదని సమాజసేవ కోసమే రాజకీయమని నిరూపించిన నేతలు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. వారిలో కొంత మంది నేటికి జీవించే . అటువంటి వారిలో ప్రముఖంగా ఉన్న ఆదర్శ రాజకీయ నాయకుడు ఖమ్మం జిల్లాకు చెందిన చేకూరి కాశయ్య. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అస్థకష్టాలు పడి ఉన్నత రాజకీయ నాయకుడిగా ఎదిగిన వ్యక్తీ చేకూరి కాశయ్య. అరవై ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండి పలు ఉన్నత పదవులు అలంకరించి జీవితంలో తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ఎనభై ఏళ్ల వయసులో నిరాడంబరంగా జీవిస్తున్న వ్యక్తీ శ్రీ చేకూరి కాశయ్య.ఆయనకు సంబందించిన జీవిత విశేషాలు నేటి రాజకీయ వేత్తలు ఆదర్శంగా తీసుకుంటే కుల్లిపోతున్న ఈ వ్యవస్థ కొంతమేరకైనా బాగుపడుతుంది. ఆయనకు సంబందించిన విశేషాలు చదవండి. సాధారణ జీవితం, వృత్తి పట్ల అంకితభావం, పెద్దలపట్ల విధేయుత ఈ మూడు లక్షణాలు పుణికిపుచ్చుకున్న వ్యక్తి తప్పకుండా ఉన్నత శిఖరాలకి చేరుకుంటాడు. ప్రతిభావంతుల జీవితాలను పరిశీలిస్తే మనకు ఈ విషయం అవగతమవుతుంది. అటువంటి వ్యక్తే ఖమ్మం జిల్లాకు చెందిన చేకూరి కాశయ్య.

*బాల్యం
కాశయ్య అప్పటి వరంగల్లు జిల్లా (ప్రస్తుత ఖమ్మం జిల్లా) మధిర తాలూక ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో చేకూరి నరసయ్య, భాగ్యమ్మ అనే రైతు దంపతులకు 1933లో జన్మించాడు. ఆ ఊరు నిజాం రాష్ట్రంలో భాగమే కనుక పాటశాలలో చదువంతా ఉర్దూలోనే ఉండేది. ఆ ఉపాధ్యాయులు దేవరకొండ సీతారామయ్యతో కాశయ్యకు అక్షరా భ్యాసం చేయించగా మూడవ తరగతి చదువు అక్కడే పూర్తీ చేసి నాల్గవ తరగతి చదువుకు మధిర వెళ్లి హెచ్ యు సి (ఆనాడు ఈ పరీక్ష రాయటానికి హనుమకొండ పరిక్ష కేంద్రం కు వెళ్ళాలి.) పూర్తీ చేసాడు. కాశయ్య గోపా వక్తగా రూపు దిద్దుకోవటానికి మధిర హైస్కూల్లో బీజం పడింది. తన క్లాసు తీచర్ట్ గాజియుద్దిన్ విద్యార్ధులు ఉపన్యాసం ఎలా ఇవ్వాలో నేర్పి, ఉపన్యసించమని వారికి పోటీలు పెట్టేవారని తమ మంచి మారటానికి గాజియుద్దిన్ ప్రోత్సాహమే ముఖ కారణమని కృతఙ్ఞత భావంతో పరవంశం చెందుతారు.

ఆ తరవాత హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో ఎఫ్ఏలో చేరారు. సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాధ చటర్జీను ఆ కళాశాల మొదటి ప్రిన్సిపాల్ గా నిజాం ప్రభుత్వం నియమించింది. విద్యార్ధి నాయకుడిగా ఉన్న కాశయ్య తెలంగాణా జిల్లాల పర్యటనలో విద్యార్ధి లోకానికే కాక, ఆనాటి రాజకీయ నాయకుల దృష్టిలో కూడా పడ్డారు. ఆ వరుసలో మర్రి చెన్నారెడ్డి కి అత్యంత సన్నిహితులు అయ్యారు. విద్యార్ధి సంఘం అధ్యక్షునిగా ఆ కళాశాలలో ఆంధ్రోభ్యుదయోత్సవాలు నిర్వహించడం మొదలు పెట్టారు. హెచ్.యు.సి పరీక్షలు అయిపోయిన తరువాత నిజాం కాలేజిలో చేరక ముందు మధిర తాలూకా వేంసూరు గ్రామానికి వెళ్లి వయోజన విద్య పాటశాల నిర్వహించారు. 1952లో మొదటి సారి జలగం వెంగళరావుతో జీపులో కల్లూరు వెళ్లి విద్యార్ధి సంఘనాయకులుగా వయోజన విద్య నేర్పడానికి 15 ఊళ్ళను ఎంచుకున్నారు.

*** 1946లో గాంధీజిని మధిర స్టేషన్ లో వేలాది జనసందోహంతో పాటు దర్శించుకుని వారు మాట్లాడిన మూడు మతాలైన హిందీ సీఖో, ఖాదీ పెహనో హరిజనో ప్రేమ కరో , కాశయ్య మీద ప్రభావం చూపించాయి. ఎనిమిదవ తరగతి నుండి ఖాదీ వస్త్రధారణ మొదలు పెట్టారు. స్వాతంత్రోద్యమ బెజవాడ ప్రాంతంలో జోరుగా సాగుతున్న రోజుల్లో నిజాం ప్రాంతంలో వెట్టిచాకిరి , భూమి కోసం, భుక్తి కోసం జరుగుతున్న పోరాటాలను తెలుగు నాడంతా ప్రజలు స్వాతంత్రేయ్యచ్చాతో రగిలిపోతూ ప్రభుత్వంతో తాడో పేడో ఉద్యుక్తులయ్యారు. 1947 లో రాష్ట్ర కాంగ్రెస్ అద్యక్షుడు స్వామీ రామానంద తీర్ధ నాయకత్వంలో తక్కెళ్ళపాడులో జరిగిన బహిరంగ సభలో నిజాం నవాబు నుండి తెలంగాణా విముక్తం చేయాల్సిన అవసరం గురించి దేశానికి స్వాతంత్ర్య సాధించుకోవాల్సిన అవసరం గురించి రామానంద తీర్ధ ఇచ్చిన ఉపన్యాసం కాశయ్య పై గొప్ప ప్రభావాన్ని చూపించింది. మధిర తలూక ఆంధ్రా ప్రాంతపు సరిహద్దుకు అతి దగ్గరలో ఉంది. కనుక ఆంధ్రప్రాంతంలో జరిగే స్వాతంత్ర్య పోరాటం ప్రభావం మధిర పైపడి తెలంగాణలో పది అమధిర ఉద్యమ కేంద్రంగా మొదటి స్థానంలో నిలిచింది. ఆనాటి విద్యార్ధి నాయకులు జాతీయ కాంగ్రెసు నాయకుల ప్రభావంతో కాశయ్య వందేమాతరం జాతీయజెండా ఎగురవేయటం, జాతీయ గీతాన్ని ఆలపించడం లాంటి కార్యక్రమాలలో పాల్గొనటం వీరి తండ్రికి ఇష్టంగా ఉండేది కాదు. తన కుమారుడు చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడని ప్రధానోపాద్యాయుడితోనూ పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ తోనూ చెప్పించినా.. కాశయ్యలో ఏమీ మార్పు రాకపోగా , వారు రెట్టించిన ఉత్సాహంతో ఆ కార్యక్రమాలలో పాల్గొనే వారు వేంసూరులోనే కాక ఆ పక్కనే ఉన్న వెంకటాపురం గ్రామంలోనూ నెలరోజులు ఉంది వయోజనులకు విద్య నేరిపించారు. ఆ వూరిలో ఉన్న భూస్వామి మాదిరాజు బాబూరావు తనవద్ద ఉన్న పెట్రోమాక్స్ లైట్ తో కిరోసిన్ నింపుకుని రోజూ ఆ గ్రామంలో వయోజన పాఠశాలకు ఇచ్చి వయోజన విద్యకు ప్రోత్సాహం ఇచ్చారు.

**ఉద్యోగ జీవితం
నిజాం కళాశాలలో బీఏ పూర్తీ చేసిన కాశయ్య చార్మినార్ ప్రాంతంలో ధర్మవంత్ హిందీ హైస్కూల్ లో ఉపాధ్యాయునిగా నియమింపబడ్డారు. (బూర్గుల రామకృష్ణారావు ఇదే పాటశాలలో చదివారు) కాశయ్య ఇదే పాటశాలలో రెండు సంవత్సరాలు పనిచేసారు. ఆ ఉద్యోగాన్ని వదిలి కొత్తగూడెంలో 1960లో సోషల్ ఎడ్యుకేషన్ ఆర్గానైజరుగా (ఎస్.ఈ.ఓ) ప్రభుత్వోద్యోగంలో చేరి 1964 వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి అక్కడి ప్రజల అభిమానాన్ని అమితంగా చూరగొనే కీ.శే.జలగం వెంగళరావు ఆశీస్సులతో కొత్తగూడెం సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

**రాజకీయ జీవితం
సమితి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన వెంతమే ఆదివారం నాడు ఉద్యోగస్థులు ఎవరూ కార్యాలయానికి రావద్దని , ఆనాడు వారంతా తమ కుతుమ్బంతోనే గడపాలని, సమితి కార్యాలయానికి తాళం వేయించి గుల మన్ననలకు, అభిమానానికి పాత్రులయ్యారు. కొత్తగూడెం సమితికి రెండు సార్లు అధ్యక్షునిగా పనిచేసి, 1972లో కాంగ్రెసు పార్టీ తరపున శాసన సభ్యునిగా ఎన్నికైనారు. తిరిగి 1978లో జనతా పార్టీ తరపున శాసనసభ్యునిగా ఎన్నుకోబడి ఆనాటి శాసనసభలో శ్రీకృష్ణ, వావిలాల, వద్దే శోభనాద్రీశ్వరరావు, వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డితో పని చేసే భాగ్యం కలిగిందని వారు ఎంతో సంతోషంగా, గర్వంగా చెబుతారు. వీరు 1977 లో జస్టీస్ విమద్ లాల్ కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ కేంద్రం ప్రభుత్వంచే నియామకం చేయించడంలో చరిత్రను సృష్టించాడు. రాజకీయ మచ్చపడని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అన్నీ పార్టీల వారితోనూ స్నేహ సంబందాలు ప్రజా సంబందాలు పెంచుకున్నారు. సమపంనులను ఆపన్నులను ఒకే రీతిగా సంభావించారు. నలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో వారు సంపాదించింది. స్నేహ మాధుర్యాన్ని మాత్రమే అని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావు వారిని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయమని ఆశీర్వదించి పంపారు. జిల్లా పరిషత్ అధ్యక్షునిగా 1987-92జిల్లా అంతా విస్తృతంగా పర్యటించి గ్రామ సమస్యలను ఆకళింపు చేసుకుని, ఆనతి అరకొర నిధులతో జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తన కార్యదక్షత, నిబద్దత, మంచితనంతో అధికారుల, రాజకీయ నాయకులను సమన్వయ పరచి జిల్లాలోని పనులను పరుగెత్తించి జిల్లా ప్రజల, నాయకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఖమ్మం జిల్లాలో కాశయ్యను తెలియనివారు ఉండరేమో.

**వైవాహిక జీవితం
కాశయ్య ఉపాధ్యాయునిగా ఉద్యోగ బాద్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే తన మేనమామ బుగ్గినేని హనుమయ్య కుమార్తె లలితను 1959లో నిరాడంబరంగా కేవలం రెండు పూల దండలుతో మాత్రమే ఆదర్శ వివాహం ఉ. వెఱికి ఇద్దరు మగ పిల్లాలు. మొదటి వారు వెంకటేశ్వరరావు (భార్య లక్ష్మి-గృహిణి), రెండవ వారు నారాయణరావు (భార్య సత్యవతి -గృహిణి) ఇద్దరు ఆడపిల్లలు సత్యవేణి, కృష్ణవేణి. వెంకటేశ్వరరావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం శాఖకు కార్యదర్శిగా ఉన్నారు. నారాయణరావు తెలంగాణా బేవరేజేస్ కార్పోరేషన్ లో సోర్సు అపీసరుగా విధులు నిర్వహిస్తున్నారు.

**సామాజిక సేవ
కాశయ్య 2002లో క్రియాశీల రాజకీయాలను విరమించి, సామాజిక సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపి, కొందరు విశ్రాంత ఉపాద్యాయులతో కలిసి ఖమ్మం పట్టణంలో ప్రభుత్వం వారు ఇచ్చిన పాతిక ఎకరాల భూమిలో నలుగు కోట్ల రూపాయలు అంచనాతో వంద పడకల ప్రకృతి వైద్యశాల, యోగా కేంద్రం, గ్రంధాలయ భవనాలు విరాళాల ద్వారా నిర్మింపజేసి, విద్యా ఆరాద్య రంగాలలో కృషికి పూనుకున్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షునిగా ఖమ్మం జిల్లా అవతరనోత్సవాలు నిర్వహించి జిల్లాలో విద్యావంతులను, ప్రజా సేవకులను, ప్రతిభావంతులైన విద్యార్ధులను సత్కరించారు. గురుశిష్య పరంపరను ఆ అనుబంధాన్ని ఈతరం వారికి నెలకొల్పారు. జిల్లాలో ఏ వివాహానికైనా ఎవరైనా మరణించినా కాశయ్యకు ఆహ్వానం లేక పోయినా ఆ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. 1978లో సింగరేణి బొగ్గు కార్మికులు చేసున 54 రోజుల సమ్మెను విజయవంతం చేయించారు. కొత్తగూడెంలో రామకృష్ణ మటం, ఆఫీసర్ల క్లబ్, ఆటోరియం స్థాపించటానికి వీరే ముఖ్య కారకులు. సంపన్నుల నుండి విరాళాలు ప్రోగుచేసి పేద విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించేవారు. ఖమ్మమ పట్టణంలో కమ్మవారి కళ్యాణ మండపం ‘స్వర్ణభారతి’ నిర్మింపజేసి వారిలో కాశయ్య పాత్ర ఎంతో గణనీయమైనది. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు ఉపాధ్యక్షునిగా, కులపతిగా నియమితులైనారు. సేవా నిరాటే పరమార్దంగా, సమాజ సంక్షేమమే సర్వస్వంగా, నిర్విరామంగా సాగుతున్న కాశయ్య జీవనం శతవసంతాలు పూర్తీ చేసుకోవాలని కోరుకుందాం. ఉపాధ్యాయునిగా, ప్రభుత్వోద్యోగిగా, ప్రజాప్రతినిదిగా సమితి, జిల్లా పరిషత్ ల అధ్యక్షునిగా, హిందీ బాషాభిమానిగా నిరంతరం కృషి సల్పిన, మానవీయ మానవతావాదిగా ఉన్న అలుపెరగని సహాయాత్రికుడు కాశయ్య. వారి వ్యక్తిత్వం ఈతరం యువతకు ఆదర్శం స్పూర్తిదాయకం కావాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com