నిధులు విడుదల చేసిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌లో భాగంగా రూ.9,940కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,378కోట్లు కేటాయించగా, ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు రూ.984కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. స్మార్ట్‌ సిటీస్‌ కార్యక్రమం కింది కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ 99 నగరాలను గుర్తించింది. ఈ నగరాల అభివృద్ధికి రూ.2.03లక్షల కోట్ల నిధులను కేటాయించడం ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగు పరచనున్నారు. మహారాష్ట్రలో పుణె, నాసిక్‌ సహా ఎనిమిది నగరాలను ఇందుకు ఎంపిక చేయగా, వాటి అభివృద్ధికి రూ.1,378కోట్లు, మధ్యప్రదేశ్‌లో ఏడు నగరాల అభివృద్ధికి గానూ రూ.984 కోట్లు కేటాయించినట్లు మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక తమిళనాడులో అత్యధికంగా 11 నగరాలను ఈ మిషన్‌ కింద అభివృద్ధి చేయనుండగా, ఇందు కోసం రూ.848 కోట్లు, కర్ణాటకలోని ఏడు నగరాలకు రూ.836కోట్లు, రాజస్థాన్‌లోని నాలుగు నగరాలకు రూ.784కోట్ల నిధులు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు నగరాల అభివృద్ధికి రూ.588కోట్లు కేటాయించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 10 నగరాలకు రూ.547కోట్లు, గుజరాత్‌కు రూ.509కోట్లు కేటాయించారు. కేంద్రం విడుదల చేసిన ఈ నిధులతో ఆయా నగరాల్లో స్మార్ట్‌ రోడ్లు, తాగునీటి సరఫరాను మెరుగు పరచడం, సైకిల్‌ ట్రాక్స్‌, పాదచారుల కోసం ట్రాక్‌, స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, ఆరోగ్య సౌకర్యాల మెరుగు, పాన్‌ సిటీ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. తాజా పథకం కింద ప్రతీ నగరానికి రూ.500 కోట్లు కేటాయించనున్నారు. ఎంపిక చేసుకున్న దాని ప్రకారం మొదట రూ.200 కోట్లు ఇవ్వనుండగా, తర్వాతి మూడేళ్లు రూ.100 కోట్లు చొప్పున కేటాయించనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com