నిర్మలమ్మ…తమరు ఎక్కడమ్మా?

కేంద్రంపై శివసేన మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. కశ్మీర్‌లో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై సోమవారం తీవ్రంగా మండిపడింది. మంత్రి పేరును ప్రస్తావించకుండా అసలు నిజంగా దేశంలో రక్షణ శాఖ మంత్రి ఉన్నారా? అని భాజపా ప్రభుత్వంపై విరుచుకుపడింది. ‘ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మన త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని వాటి అధినేతలు హామీ ఇస్తుంటారు. మాకు వాటి మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంది. కానీ వాటికి నాయకత్వం వహించే మంత్రికే ఎటువంటి నైపుణ్యాలు లేవు. అత్యంత బలహీనమైన, అసమర్థత కలిగిన వారు మనకు నాయకత్వం వహిస్తున్నారు. ఇది దేశానికి ఎంతో హానికరం’ అని తీవ్రంగా విమర్శించింది. లేకపోతే ఉగ్రమూకలకు రంజాన్ నెలలో ఓ సైనికుడిని హతమార్చడానికి అంత ధైర్యం రాదని ఎద్దేవా చేసింది. కశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న ఔరంగజేబు అనే సైనికుడు రంజాన్‌ పండుగ జరుపుకోవడానికి ఇంటికి వస్తుండగా ఉగ్రవాదులు అతడిని అపహరించి, హతమార్చారు. ‘స్వరాజ్‌ను ధ్వంసం చేసిన మొఘల్ చక్రవర్తి దేశానికి కీడు చేశాడని మేము అతడిని విమర్శిస్తాం. కానీ ఈ ఔరంగజేబు దేశం కోసం పోరాడి అమరుడయ్యాడు’ అని కీర్తించింది. అతడి పోరాట స్ఫూర్తి, ధైర్య సాహసాలు దేశం ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటుందని కొనియాడింది. ఉగ్రవాదులను ఏరివేసే కమాండో బృందంలో ఔరంగజేబు ముందు వరసలో ఉన్నారు. దాంతో ఉగ్రవాదులు అతడిని అపహరించి తీవ్ర చిత్ర హింసలకు గురిచేసి దారుణంగా హతమార్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com