నేటి ఆధ్యాత్మిక వార్తలు-౦౨/౧౫

*శ్రీగిరిలో వైభవంగా రధోత్సవం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల తొమ్మిదో రోజైన బుధవారం శ్రీశైలంలో భ్రమరాంభిక మల్లిఖార్జున స్వామీ వార్లకు వైభవంగా రధోత్సవం జరిగింది. శ్రీస్వామి అమ్మవారాలను వెండి పల్లకిలో రాధాశాల వద్దకు తీసుకువచ్చి రదాంగ హోమం, రాధాంగా బాలి అమర్పించి రధం ఫై ఆశీనులను గావించారు. వేలాది మంది భక్త జనుల శివనామ స్మరణ నడుమ స్వామీ అమ్మవార్లకు శ్రీగిరి పురవీధుల్లో రహోతవం కన్నుల పండువగా జరిగింది. రధోత్సవం ఎదుట కళాకారులు నృత్య ప్రదర్శనతో అలరించారు.
*ఆదిదంపతుల విహారం
శ్రీకాళహస్తీశ్వరస్వామి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం జోడు రథాలపై ఆదిదంపతుల వైభవంతో భక్తకోటి పులకించిపోయింది. శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత సోమస్కంధమూర్తి ఉత్సవమూర్తులను జోడు రథాలపై చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు. అశేష భక్తగణంతో చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని సోమస్కంధమూర్తి, శ్రీజ్ఞానప్రసూనాంబిక ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలంకార మండపం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి భిక్షాల గాలి గోపురం వద్ద ఉన్న నెప్పల మండపంలో సంకల్పపూజలు నిర్వహించారు. ముందు సర్వేశ్వరుడి రథం.. వెనుక సర్వేశ్వరి రథాల ఊరేగింపు మహోత్సవం ఘనంగా జరిగింది.
*వైభవంగా సోమేశ్వరుడి రధోత్సవం
పంచారమ క్షెత్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి సోమేశ్వర స్వామీ రదోత్సవం భారీగా తరలివచ్చారు. భక్త సందోహం మధ్య బుధవారం కన్నుల పండువగా సాగింది. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ప్రత్యేకంగా అలంకరించిన రధం పై క్షెత్ర పాలకుడైన జనార్చన స్వామీ తోడురాగా సోమేశ్వర స్వామీ, పార్వతీ అమ్మవారితో ఆశీనులయ్యారు.
* ఎర్ర నీళ్ళ దిష్టి ఎందుకు తీస్తారు.
మనిషి కంటి చూపుకి మహాశక్తి ఉంది. కొత్త వాహనానికి నిమ్మకాయలు కట్టడమూ, ఇంటి గుమ్మానికి గుమ్మడి కాయను కట్టడం.. ఇవన్నీ దిష్టిలో భాగాలే. నిజంగా దిష్టి ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి. మీరు బాగా చేసే వంట ఒక్కోసారి భయంకరంగా తయారవుతుంది. తీరా తరచి చూసుకుంటే ఆ సమయంలో వచ్చిన వారు చేస్తున్న వంట గూర్చి మాట్లాడినట్లు గుర్తుకు వస్తుంది. ఆ వంట మీరు ఎంతో బాగా చేస్తారన్నట్టు గుర్తుకు వస్తుంది. అదే దిష్టి. అన్ని సార్లు బాగా వచ్చిన వంట ఎందుకిలా అయిందో మీకు బోధపడుతుంది. మనిషి కనుల నుంచి అద్భుతమైన విద్యుత్ ప్రసరిస్తుంది. కొంత మంది మంచి దృష్టితో చూస్తె మరికొంతమంది ద్వేష దృష్టితో చూస్తారు. ఫలితమే ఇది. అటువంటి సమయాల్లోనూ , పదిమంది నోట్లో మీ పేరు నానినప్పటికి ..సున్నమూ, పసుపూ కలిపినా ఎర్రనీళ్ళతో దిష్టి తీసి దూరంగా పోయాలి. పక్కవారికి ఇబ్బంది లేకుండా చేసే ఏ చర్య అయినా , నమ్మకమైనా మంచిదే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com