నేటి క్రైమ్ కహానీ-౧౧/౨౯

*ట్రాలీ పై ప్రోక్లేయిన్ ను తీసుకువెళ్తుండగా చోటు చేసుకున్న విద్యుత్ ప్రమాదంలో o యువకుడు సజీవ దహనమయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఏలూరు నుండి ప్రోక్లేయిన్ గునగాపర్రు కు తరలిస్తుండగా నిడమర్రు సమీపంలో విద్యుత్ తీగలు అడ్డు వచ్చాయి. దీంతో వాహనాన్ని ఆపారు.
* తండ్రి మరణానంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఏళ్లు గడుస్తున్నా చెల్లించకపోవటంతో మనస్తాపం చెందిన అక్కాచెల్లెళ్లు మంగళవారం అసెంబ్లీ గేటు ఎదుట పురుగుమందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
*పాకిస్థాన్‌ మూలాలున్న అమెరికా ఉగ్రవాది, ముంబయి దాడుల నిందితుడు ‘‘డేవిడ్‌ కొలేమాన్‌ హెడ్లీ’’లానే కశ్మీర్‌లోని కీలక ప్రాంతాలపై వీడియోలు చిత్రీకరించిన లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) ఉగ్రవాది అరెస్టయ్యాడు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని వారణాసిలో భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి మంగళవారం ఇతణ్ని పట్టుకున్నాయి.
*ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలు నిర్వహించే సమయంలో విధ్వంసానికి పాల్పడే వ్యక్తులను గుర్తించి ఆయా ఘటనల్లో జరిగే ప్రాణ, ఆస్తి నష్టాలకు వారిని బాధ్యులను చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితులకు పరిహారం చెల్లించేలా చర్యలుండాలని తెలిపింది.
*మహారాష్ట్రలో గతేడాది చోటుచేసుకున్న 15ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ముగ్గురు దోషులకు మరణశిక్ష పడింది. ఈ కేసులో విచారణ చేపట్టిన అహ్మద్‌నగర్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు దోషులకు మరణశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది.
*కోప్రాది గ్యాంగ్‌రేప్‌, హత్య కేసులో ముగ్గురు నిందితులకు అహ్మద్‌నగర్‌ జిల్లా సెషన్సు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా గత ఏడాది సంచలనం సృష్టించిన కోప్రాది గ్యాంగ్‌రేప్‌, హత్య కేసులో జితేంద్ర బాబూలాల్‌ షిండే, సంతోష్‌ గోర్కా బవాల్‌, నితిన్‌ గోపీనాథ్‌ భలూమే నిందితులుగా ఉన్నారు. ఈ కేసు విచారించేందుకు 2016 డిసెంబర్‌ 20న స్పెషల్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేశారు.
*అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి వర్గీయుల దాడులు కొనసాగుతున్నాయి. అప్పేచెర్ల గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్త హరిప్రియపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె చేతిని నరికేశారు. ఈ ఘటనలో హరిప్రియ తీవ్రంగా గాయపడ్డారు. జేసీ వర్గీయులే తనను చంపేందుకు ప్రయత్నించారని హరిప్రియ ఆరోపించారు.
*వైఎస్‌ జగన్‌ చిన్నాన్నమాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి తోడల్లుడు సుధాకర్‌రెడ్డిని చీటింగ్‌ కేసులో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చనిపోయిన వారి పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి ఆరె కరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వైనం వెలుగు చూసింది. ఈ చీటింగ్‌ వ్యవహారంపై కడప రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సుబ్బరాయుడు ఫిర్యాదుపై వైఎస్‌ వివేకానందరెడ్డి తోడల్లుడు సుధాకర్‌రెడ్డిఆయన కుమారుడు సుజిత్‌రెడ్డి సహా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు కడప తాలుకా పోలీసులు మంగళవారం సుధాకర్‌రెడ్డిని అరె స్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు.
*ఓ పాఠశాల బస్సు చెట్టును ఢీకొనడంతో మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలం దాలవాయి కొత్త ఇళ్ల దగ్గర ఇండో-జర్మన్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో బస్సులో ఉన్న మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. విద్యార్ధులను చికిత్స నిమిత్తం పల్లిపట్టు ఆసుపత్రికి తరలించారు.
*కావలి తుఫాన్‌ నగర్‌కు చెందిన షేక్‌ హజరత్‌ అలియాస్‌ అజ్జిబాబు (తన బావమరిది పెళ్లికి ద్విచక్ర వాహనంపై వెళుతూ సోమవారం రాత్రి కలిగిరి మండలం పాతనాపురం వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని మృత్యువాత పడ్డాడు. మంగళవారం ఆయన పుట్టిన రోజు కావడం అదే రోజు మృతి చెందడం అందరినీ కలిచివేసింది.
* కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఏడాది బెంగళూరు నగరంలో అమ్మాయిలపై జరిగిన లైంగికవేధింపుల ఘటనలు పునరావృతం కాకుండా నగరంలో సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయాలని నగర మేయరు సంపత్ రాజ్ అధికారులను ఆదేశించారు.
* భార్యను నిర్బంధించి భర్తపై యాసిడ్‌ దాడి జరిగిందనే వార్త నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో సంచలనం కలిగించింది. ఈ సంఘటనలో బాధితుడు హైదరాబాద్‌లోని ప్రధాన ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తెలకపల్లి మండలం బండపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డి గట్టునెల్లికుదురుకు చెందిన స్వాతితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది.
*స్కార్పియో ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నేరేడ్‌మెట్ పరిధిలోని సఫిల్‌గూడ ప్రాంతంలో బలరామ్‌నగర్‌కు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి రోడ్డుపక్కన ఓ స్వీట్ హౌస్ దగ్గర నిలుచుని ఉండగా వెనుక నుంచి వచ్చిన ఏపీ09బీఎఫ్0418 అనే నెంబర్ గల స్కార్పియో వాహనం ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా… ప్రతాప్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపెట్ మండలం ఏడిప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన కారు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
* చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో గొలుసు దొంగతనం జరిగింది. ఇందిరానగర్ కాలనీ మూడో వీధిలో మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలు రత్నమాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మెడలో నుంచి 2 తులాల బంగారం గొలుసును లాక్కెళ్లినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.
* హద్దుమీరి భారత సముద్రతీరంలోకి ప్రవేశించిన నేరంపై ఐదేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న 35 మందికి విముక్తి లభించింది. అమెరికా ఆయుధ నౌక కెప్టెన్‌ సహా 35 మందికి పడిన శిక్షను మదురై హైకోర్టు శాఖ సోమవారం కొట్టివేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com