నేటి క్రైమ్-౦౧/౨౦

* వనస్థలిపురం చైతన్య నగర్‌లో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేగింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి అంతయ్య(68) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేశారు. దీనికి రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యవహారాలే కారణమని అనుమానిస్తున్నారు. అతడి బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
*తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక శివాలయం వద్ద పది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదం జరగడానికి కారణం తెలియరాలేదు. పది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.
* పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లీ కూతుళ్ళను దారుణంగా హత్య చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పోలవరం మండలం ఎల్ఎన్‌డీ పేట గ్రామానికి చెందిన ఇళ్ల సావిత్రి(40), పులిబోయిన మంగతాయారు(19) తల్లీ కూతుళ్లు. అయితే… వీరు గత నవంబర్ 2 వ తేదీ నుంచి కనబడకుండా పోయారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది.
* మహానంది రహదారిలో ఉన్న బుక్కాపురం వద్ద ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రయాణికుడే డ్రైవర్‌ వద్దనుంచి ఆటో తాను నడుపుతానంటూ తీసుకొని డ్రైవింగ్‌ చేసినట్లు ప్రత్యక్ష్య సాక్షులు తెలిపారు. బాధితులందరినీ మండల ఆస్పత్రికి తరలించారు.
*అత్తఆడపడుచుల వేధింపులు తట్టుకోలేక గొరజవోలుకు చెందిన బత్తుల రేణుక (26) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలను నాదెండ్ల పోలీసులు శుక్రవారం సాయంత్రం వెల్లడించారు.
*నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నిర్మల్‌ నగర్‌లో రిటైర్డ్‌ ఎస్‌ఐ శంకరయ్య ఇంట్లో చోరీ జరిగింది. శంకరయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఊరెళ్లాడు. శుక్రవారం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న నగలునగదు అపహరణకు గురైనట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.
*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్త హత్య కేసులో కేరళ పోలీసులు పురోగతి సాధించారు. సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ)కి చెందిన నలుగురు కార్యకర్తలను కన్నూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
*చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. కుమారుడి మృతితో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన ఆమె కూడా ఉరేసుకుని తనువు చాలించింది. హృదయ విదారకమైన ఈ సంఘటన పట్టణంలోని రామాలయం వీధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
*భర్త కళ్లెదుటే నవ వధువు కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు కబళించడం కన్నీరు పెట్టించింది. మూడు నెలలు కాకుండానే మూడు ముళ్ల బంధం ముగిసిపోవడం విధిని శాపనార్థాలు పెట్టేలా చేసింది.
* తమిళనాడు డీఎంకే ఎంపీ కనిమొళిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కరీంనగర్‌ మొదటి అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ సంపతిరావు చందన పట్టణ మూడో ఠాణా పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
*ఆమె సంస్థలో చేరింది మూడు నెలలే కానీ.. నెలన్నర నుంచి సంస్థ ఎండీ (జర్మన్‌ దేశస్థుడు) వాట్సాప్‌తో వేధించడం మొదలు పెట్టాడు. ఆ సంస్థ ఎండీనే అలా చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉద్యోగానికి రాజీనామా చేసింది.
*వనస్థలిపురం నగర శివారులోని వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. బస్సులోంచి కిందపడ్డ రబ్బరును అందుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థిని తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది.
*నొప్పికి ఉపశమనంగా ఇచ్చిన ఇంజెక్షన్‌ వికటించి నాలుగు నెలల చిన్నారి మృతిచెందిన ఘటన దేశ రాజధాని దిల్లీలో చోటుచేసుకుంది. గాయానికి కుట్లు వేసిన అనంతరం చిన్నారి నొప్పి భరించలేక గుక్క పెట్టి ఏడుస్తుండటంతో వైద్యులు మత్తు మందు ఇంజెక్షన్‌ ఇచ్చారు. అది కాస్త వికటించడంతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది.
*పశ్చిమబంగా‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బంగాల్‌లోని బెల్దంగలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడింది. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.
* ఏడాది క్రితంనాటి తల్లీకూతుళ్ల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్.ఎన్.డి.పేట గ్రామానికి చెందిన ఇళ్ల సావిత్రి (40), పులిబోయిన మంగతాయారు(19)లు తల్లీ కూతుళ్లు. వీరు గత ఏడాది నవంబర్ 2వ తేదీ నుండి కనబడకుండా పోయారు. ఈ అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటీడీఏ నుంచి ఎర్రాయగూడెం వెళ్లే రహదారి పక్కన జీడిమామిడి తోటలో వీరి శవాలను కనుగొన్నారు. తల్లీకూతుళ్ళను హత్య చేసి మృతదేహాలను పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
* మానవత్వం లేని కొందరు మృగాళ్లు.. గర్భిణిపై విరుచుకుపడ్డారు. బహిర్భుమికి వెళ్లిన ఆ అబలపై.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కచౌలా గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కచౌలా గ్రామానికి చెందిన గర్భిణి(బహిర్భూమికి గ్రామ సమీపంలోకి వెళ్లింది. ఈ క్రమంలో కొందరు యువకులు.. ఆమెను బలవంతంగా దగ్గర్లో ఉన్న అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. చేతులుకాళ్లు కట్టేసి నోట్లో బట్టలు నొక్కారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.
* తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. డాక్టర్ ముసుగులో వచ్చిన ఓ దొంగ.. వైద్యం కోసం వచ్చిన ఓ మహిళ మెడలోని బంగారం గొలుసును చోరీ చేశాడు. తిరుపతిలోని గోపిమాధురి ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.
*చిత్తూరుజిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంకాటూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పండుగకు అక్క ఇంటికి వచ్చిన ఓ బాలుడు తెలుగుగంగ మెయిన్‌ కాలువలో పడి గల్లంతయ్యాడు.
* కట్నం కోసం కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురి చేస్తూ.. కెనడా వెళ్లిన వ్యక్తిని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నాంపల్లిలోని 15వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు నిందితుడికి వచ్చే నెల 2వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
* పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. రేణుమాను మిట్ట వద్ద కారు దగ్దమైన సంఘటన జరిగింది. కడప నుంచి హార్సిలీహిల్స్ కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పొగలు రావడంతో గమనించి అందులోని వారు కిందకు దిగిపోయారు. వెంటనే మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. బాధితుడు కడపకు చెందిన బంగారు షాపు యజమాని మహమ్మద్ గా తెలుస్తోంది. పర్యాటక కేంద్రం సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారమందించగా వారు వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు.
* సైకిల్‌పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని తవేరా వాహనం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందగా, బాలుడికి గాయాలపాలైన సంఘటన మండల కేంద్రంలోని పరకాల–భూపాలపల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగింది.
* టర్కీలోని ఎస్కిసెహీర్‌ ప్రావిన్సులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్కిసెహీర్‌ – బుర్సా హైవేపై వేగంగా వెళ్తున్న బస్సు మూడు చెట్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com