నేటి క్రైమ్-౦౨/౦౪

* శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దారిలో ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఓ వాహనం దగ్ధమయింది. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
* కటక్‌లోని బాదంబాడి ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు హోటళ్లు, దుకాణ సముదాయంలో మంటలు వ్యాపించాయి. దీంతో వాటిలో ఉన్న సామాగ్రి అంతా దగ్ధమయింది. 10 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
*రంగారెడ్డిజిల్లాలోని శంషాబాద్ మండలం చౌదర్‌గూడలో దారుణం జరిగింది. మూగ బాలికపై ఇంటర్‌ చదువుతున్న విద్యార్థి మహేందర్ అత్యాచారం చేశాడు. ఇది గమనించిన స్థానికులు అతనిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
*నరసాపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రుస్తుం బాద పంచాయతీ మండావారిగరువులో భార్యపై అనుమానంతో భర్త ఆమెను హత్య చేశాడు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు నరసాపురం సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు.
*కుటుంబ కలహాలో మరే ఇతర కారణమో తెలియదు కానీ ఓ వ్యక్తిని నాపరాయితో తలపై మొది దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన శనివారం వినాయక థియేటర్‌ సమీపంలో వెలుగులోకి వచ్చింది.
*అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకానికి రూ.30 లక్షలు లంచం తీసుకుంటూ కోయంబత్తూరులోని భారతీయార్‌ వర్సిటీ వీసీ గణపతి అవినీతి నిరోధక విభాగం అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు
*అర్ధరాత్రి హఠాత్తుగా మంటలు చెలరేగి ఒక ఉపాధ్యాయునితోపాటు ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. అతని భార్యకూడా అగ్నికీలల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ జిల్లాలోని గరియాబంద్ జిల్లా టెమ్రా గ్రామంలో జరిగింది.
*పురాతన దేవతా విగ్రహాలను దొంగిలిస్తూ తప్పించుకుని తిరుగుతున్న కర్ణాటకకు చెందిన బాల్చీ ముఠాను హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి సుమారు 600 ఏళ్ల కాలం నాటి వేణుగోపాల స్వామి, రుక్మిణి, సత్యభామ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆదివారం నిందితులను విలేకరుల సమావేశంలో ప్రవేశపట్టిన ఆనంతరం కమిషన్‌ వివరాలు వెల్లడించారు.
*అనుమానాస్పదంగా ఆర్మీ ఉద్యోగి భార్య మృతి చెందింది. తమిళనా డు రాష్ర్టానికి చెందిన బాలకృష్ణ, అను గుశెల్వి(27)భార్యాభర్తలు. వీరికి 2009 లో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు ఉన్నారు.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో శనివారం మావోయిస్టులు, ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల నడుమ హోరాహోరీ ఎదురు కాల్పులు జరిగాయి. మండల పరిధిలోని గోరుకొండలో ఇరువర్గాల మధ్య రెండు గంటలపాటు పోరు జరిగింది.
*వేరువేరుగా జర్దా, గుట్కాను తరలిస్తున్న రెండు వాహనాలను శంషాబాద్‌ జోన్‌ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.72లక్షల విలువచేసే జర్దా, గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో శనివారం శంషాబాద్‌ డీసీపీ పద్మజారెడ్డి వివరాలు వెల్లడించారు.
*భార్యపై అనుమానం అమానుషానికి దారి తీసింది. కట్టుకున్న భర్త ఇనుపగొట్టంతో తలపై, ముఖంపై విచక్షణారహితంగా కొట్టడంతో భార్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన నరసాపురం మండలం రుస్తుంబాద శివారు మండావారిగర్వులో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
*చిలుకానగర్‌లో చిన్నారి తల దొరికిన కేసు రాచకొండ పోలీసులకు సవాలుగా మారింది. ఉన్నతాధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుండటం, చిన్నారి మొండం ఇప్పటికీ లభించకపోవడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
*తాడేపల్లిగూడెంలోని ప్రతిష్ఠాత్మక ఏపీ నిట్‌లో ర్యాగింగ్‌ భూతం పురివిప్పింది. పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజినీరింగ్‌ కళాశాలలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న నిట్‌ ప్రాంగణంలోనే శుక్రవారం సాయంత్రం ప్రథమ సంవత్సరం చదువుతున్న బిహార్‌కు చెందిన ముకుల్‌ కుమార్‌ను ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరానికి చెందిన మొత్తం 15 మంది విద్యార్థులు ర్యాగింగ్‌ చేశారు.
* చోరీలకు పాల్పడుతూ జైలుశిక్ష అనుభవించినా తీరు మారకపోగా.. ముఠా కట్టి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు పాత నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
*అనుమానం పెనుభూతమై.. ప్రేమించి.. త్వరలో పెళ్లాడబోతున్న యువతిని బండరాయితో మోది హత్యచేసిన యువకుడిని హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. శనివారం ఎల్బీనగర్‌ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వేంకటేశ్వర్‌రావు నిందితుడి వివరాలు వెల్లడించారు.
* కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగళ్లు గ్రామ పరిధిలోని చైతన్య జూనియర్‌ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వైభవ్‌ క్యాంపస్‌లో చదువుతున్న విద్యార్థిని శనివారం మధ్యాహ్నం క్యాంపస్‌లోని గదిలో ఉరివేసుకుంది.
*శ్రీనివాస్‌ హత్య కేసులో విచారణాధికారిగా ఉన్న నల్గొండ రెండో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు విధుల్లో చేరారు. ఆయన శుక్రవారం అదృశ్యమవ్వడం పలు అనుమానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని రోజులుగా నిద్రలేమి ఉండడం వల్ల విశ్రాంతి కోసమే తాను బాపట్ల వెళ్లినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.
*కశ్మీరీ యువతలో ఒక తరం తనకు మద్దతు తెలిపేలా చేయాలన్న ఉద్దేశంతో పాకిస్థాన్‌ ప్రభుత్వం పలు ప్రలోభాలను ఎరవేస్తోంది. చాలా మందిని విద్యార్థుల వీసా పేరుతో అక్కడికి రప్పించుకొని ఎంబీబీఎస్‌, ఇంజినీరింగ్‌ చదువుల కోసం ఉపకార వేతనాలు ఇస్తోంది. ఇలావెళ్తున్న యువకులంతా ఉగ్రవాదుల బంధువులు, హురియత్‌ నేతలకు తెలిసినవారు కావడం గమనార్హం.
*పాకిస్థాన్‌ సైన్యానికి చెందిన క్రీడా విభాగంపై శనివారం సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది గాయపడ్డారు. స్థావరం వెలుపల వాలీబాల్‌ ఆడుతున్న సైనికుల వద్దకు ఆత్మాహుతి సభ్యుడు వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు.
*కాన్పూర్‌లోని వస్తు, సేవలపన్ను (జీఎస్‌టీ) విభాగం అవినీతి బాగోతాన్ని సీబీఐ బయటపెట్టింది. జీఎస్‌టీ కమిషనర్‌ సంసార్‌ చంద్‌, మరో 8 మందిని అరెస్టు చేసింది. ఈ అధికారులు.. కాన్పూర్‌లోని వ్యాపారులు, పారిశ్రామికవేత్తలనుంచి క్రమంతప్పకుండా లంచాలు వసూలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
*పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను.. కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రత దళాలు అరెస్టు చేశాయి.
*ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ హుకుమ్‌ సింగ్‌ (79) శనివారం ఇక్కడి ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు అయిదుగురు కుమార్తెలు ఉన్నారు. కైరానా నియోజకవర్గం నుంచి ఎన్నికయిన ఆయన గతంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మంత్రిగానూ పనిచేశారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా సంతాపం తెలిపారు.
*ఏపీలోని కర్నూలు జిల్లా పాణ్యం మండలం బలపనూరుమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన లారీ ఎద్దుల బండిని ఢీకొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
* ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరులో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఆడపిల్లను కన్నందుకు భార్యకు భర్త కరెంట్ షాక్ ఇచ్చాడు. బాధితురాలు ప్రశాంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. భర్త రాజారత్నం ఆకృత్యంపై కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు మండలం ముకుందపురంలో గల ఎస్‌బీఐ ఏటీఎంలో గడిచిన రాత్రి చోరీ జరిగింది. ఏటీఎంను కొల్లగొట్టిన దొంగలు నగదుతో ఊడాయించారు. చోరీ సొత్తు వివరాలు తెలియాల్సిఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులోని చత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా తొగ్గూడెం పోలీస్ క్యాంపుపై శనివారం 100 మంది సాయుధులైన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన పోలీసులు సైతం ఎదురు కాల్పులు జరిపారు.
*జేకేసీ కళాశాల స్వర్ణోత్సవాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు హాజరైన నేపథ్యంలో బందోబస్తుకు వచ్చిన సెక్యూరిటీ గార్డు పంచకర్ల పవన్‌కుమార్‌ (43) గుండెపోటుతో మృతి చెందారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com