నేటి క్రైమ్-౦౨/౦౬

*గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌ శ్రీశైలం రహదారిలోని గూడూరుగేట్‌ సమీపంలో జరిగింది. కందుకూరుకు చెందిన సతీష్‌(21) అనే యువకుడు మటన్‌ వ్యాపారి. నగరంలోని జియాగూడకు వ్యాపారానికి వెళుతుండగా గూడూరు గేట్‌ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
*తక్కువ ఫీజుకే చికిత్స పేరుతో ఓ నకిలీ వైద్యుడు చేసిన నిర్వాకం వల్ల 21 మంది జీవితాలు నాశనమయ్యాయి. ఒకే సిరంజీతో ఇంజెక్షన్‌ చేయడంతో వారందరికీ హెచ్‌ఐవీ సోకింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
*బత్తలపల్లిమండలంలోని లింగారెడ్డిపల్లి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని 407 వ్యాన్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
*గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న రైలులో రూ.కోటి 43 లక్షల విలువైన బంగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
*భువనగిరి మండలం రామచంద్రాపురం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
*సమస్యలతో సతమతమవుతూ హుస్సేన్‌సాగర్లో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరిని లేక్ పోలీసులు రక్షించారు. ధూల్‌పేట్‌కు చెందిన 22 ఏళ్ల మహిళ కొద్ది నెలల నుంచి కుటుంబ సమస్యలతో బాధపడుతూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. చనిపోవాలని నిశ్చయించుకుని సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు ట్యాంక్‌బండ్‌పై గల పాత లవ్ హైదరాబాద్ ప్రాంతానికి చేరుకొని హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నించింది.
*ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో మరో ఘరానా మోసం బయటపడింది. రాజధానికి భూమి ఇవ్వకుండానే గౌస్‌ ఖాన్‌ అనే వ్యక్తి పెద్ద ఎత్తున లబ్ధి పొందాడు. సీఆర్డీఏ అధికారులతో కలిసి అతడు ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
*దైవదర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి కూడేరు మండలం ముద్దలాపురం వద్ద అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిలో చోటు చేసుకుంది.
*హైదరాబాద్‌ నగరంలోని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని ఆడిట్ విభాగంలో ఉదయం 7 గంటలకు మంటలు చెలరేగి సామాగ్రి అంతా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కంప్యూటర్, ముఖ్యమైన దస్తావేజులు, ఫర్నిచర్ ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సకాలంలో రెండు అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని మంటలు మరింత వ్యాపించకుండా అదుపుచేశాయి. సుమారు గంటసేపు ప్రయత్నించి అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటన ఎలా జరిగింది అనే దానిపై విచారణ చేపట్టినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు.
*శాంసంగ్ సంస్థ వారసుడు లీ జా యంగ్ జైలు నుంచి విడుదలయ్యాడు. అవినీతి కేసులో అతను అయిదేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే ఇవాళ సియోల్ హైకోర్టు ఈకేసులో తీర్పును వెల్లడించింది. తన ఎగ్జిక్యూటివ్ అధికారాలను వినియోగిస్తూ.. లీను విడుదల చేయాలంటూ కోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.
*ఆస్తి తగాదాల కారణంగా భార్య మీద కోపంతో కన్నకూతురిని కడతేర్చాడు ఆ కసాయి తండ్రి. అంతటితో ఆగకుండా తన సంతానమైన మరో ఇద్దరు పిల్లల్ని సైతం చంపేందుకు విఫలయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో చోటుచేసుకుంది.
*పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదన్న మనస్తాపంతో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని హైదరాబాద్‌ బిట్స్‌ పిలాని క్యాంపస్‌లో జరిగిన ఘటన సోమవారం వెలుగుచూసింది.
*తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు దండకారణ్యంలో మావోయిస్టులు చెలరేగారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం ఎదిర గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ఫోన్‌ ఎక్స్ఛేంజిని పేల్చివేసి అలజడి సృష్టించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ సోమవారం దండకారణ్యం, తెలంగాణ బంద్‌కు సీపీఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
*కొండాపూర్‌లో గర్భిణి దారుణ హత్య వెలుగుచూసి వారం రోజులు గడిచినా ఇప్పటి వరకు పోలీసులకు ఆరాధాలు లభించలేదు. హతురాలి వివరాల ఆచూకీ లభించకపోగా హత్య చేసిన దుండగులకు సంబంధించి చిన్న ఆధారం సైతం దొరకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
*పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదన్న మనస్తాపంతో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని హైదరాబాద్‌ బిట్స్‌ పిలాని క్యాంపస్‌లో జరిగిన ఘటన సోమవారం వెలుగుచూసింది.
* ప్రముఖ నగల వ్యాపారి, బిలియనీర్‌ నీరవ్‌ మోదీపై కేంద్ర దర్యాప్తు సంస్థ చీటింగ్‌ కేసు నమోదు చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు సంబంధించి రూ.280కోట్ల మోసానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
*భర్త తనను వేధిస్తున్నాడని ఓ వివాహిత సోషల్‌మీడియా సాయంతో పోలీసులను ఆశ్రయించింది. అప్పటివరకు స్పందించని పోలీసులు అశోక్‌ పండిట్‌ అనే బాలీవుడ్‌ దర్శకుడు ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో రంగంలోకి దిగారు. వివరాల్లోకెళితే.. ముంబయిలోని ఖర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్త తనను హింసిస్తున్నాడని న్యాయం చేయండంటూ వీడియోలో తన బాధను చెప్పుకొంది.
* ఆస్తి తగాదాల కారణంగా భార్య మీద కోపంతో కన్నకూతురిని కడతేర్చాడు ఆ కసాయి తండ్రి. అంతటితో ఆగకుండా తన సంతానమైన మరో ఇద్దరు పిల్లల్ని సైతం చంపేందుకు విఫలయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో చోటుచేసుకుంది.
*ముంబయి-పుణె ఎక్స్ ప్రెస్‌హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేవీ అధికారి శ్రీకాంత్‌ నాగిపోగు (26) మృతి చెందారు. ఆయన లోనావాలాలోని ‘ఐఎన్‌ఎస్‌ శివాజీ’ నౌకాస్థావరంలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్నారు.
*విద్యుత్తు నియంత్రిక(ట్రాన్స్ ఫార్మర్‌) మరమ్మతు పనులు చేస్తుండగా.. విద్యుత్తు సరఫరా అయ్యి ఓ ఒప్పంద కార్మికుడు స్తంభంపైనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం 44వ జాతీయ రహదారి సమీపంలో సోమవారం చోటుచేసుకుంది.
*గౌహతి-చెన్నై ఎక్స్ ప్రెస్‌ రైలులోని ప్రయాణికుని వద్ద నుంచి అధికారులు సుమారు రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని 15 బిస్కెట్లుగా తరలిస్తుండగా ఖుర్దారోడ్‌ రైల్వేస్టేషన్‌లో ఆదివారం రాత్రి డైరక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు దాడిచేసి పట్టుకున్నారు.
*గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకున్న ఏడేళ్ల విద్యార్థి హత్య కేసులో 16 ఏళ్ల విద్యార్థికి వ్యతిరేకంగా సీబీఐ సోమవారం అభియోగపత్రం దాఖలు చేసింది.
*దాదాపు 16 సంవత్సరాల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన పేలుడు ఘటనలో నిందితుడ్ని ఎట్టకేలకు సీఐడీ అధికారులు పట్టుకున్నారు. ఒమన్‌లో ఉంటున్న షఫీక్‌ అనే వ్యక్తిని ఇంటర్‌పోల్‌ సహకారంతో భారత్‌ తీసుకొచ్చి అరెస్టు చేశారు. 2002లో దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా మందిరం వద్ద స్కూటర్‌ బాంబు పేలిన సంగతి తెలిసిందే.
*దాణా కుంభకోణంలో దోషిగా కోర్టు ప్రకటించిన బిహారు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్ర సోమవారం నాడిక్కడ ప్రత్యేక సీబీఐ న్యాయస్థానంలో లొంగిపోయారు.
*దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ మావోయిస్టు అగ్రనేత ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జప్తు చేసింది. బిహార్‌కు చెందిన మావోయిస్టు కమాండర్‌ సందీప్‌ యాదవ్‌ అలియాస్‌ బడ్కా భయ్యా, ఆయన కుటుంబసభ్యుల పేరిట ఉన్న రూ.86 లక్షల విలువైన ఆస్తులను సోమవారం స్వాధీనం చేసుకుంది.
*చిన్నారి చేసిన తప్పిదంపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే క్రమంలో ఓ గురువే గాడితప్పారు. అమానవీయంగా వ్యవహరించారు. బాలుడి చేత మూత్రమున్న పళ్లరసం (జ్యూస్‌) తాగించారు. ప్రకాశం జిల్లా చీరాలలోని ఎన్‌పీఆర్‌ విద్యా కాన్సెప్ట్‌ స్కూల్‌లో పేరాలకు చెందిన ఐ.శ్యాంసన్‌ విజయ్‌కుమార్‌ వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
*నలభైసార్లు జైలుకెళ్లినా.. పీడీయాక్టు కింద జైలు జీవితం గడిపినా.. అతని నేర ప్రవృత్తిలో మార్పు రాలేదు. ఆ ఘరానా గజదొంగను సీసీ పుటేజీల ఆధారంగా సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నాచారం సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో రాచకొండ సీసీఎస్‌ క్రైమ్‌ డీసీపీ కేఆర్‌ నాగరాజు వివరాలు వెల్లడించారు.
*భార్యను కాపురానికి పంపడం లేదన్న కక్షతో అత్తనే హతమార్చాడు ఓ అల్లుడు. ఈ ఘటన రాత్రి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్‌లో చోటుచేసుకుంది.
*జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌లోని ఓ ఆస్పత్రి పరిసరాల్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన ఖైదీ నవీద్‌ను పోలీసులు శ్రీ మహరాజా హరిసింగ్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి పరిసరాల్లోకి ప్రవేశించగానే ఖైదీ వెంట ఉన్న పోలీసు కానిస్టేబుళ్లపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్‌ మృతిచెందగా, మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి విధించిన అనంతరం ఏకంగా దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే అరెస్ట్‌ చేశారు. అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ నిన్న మాల్దీవుల్లో 15 రోజుల పాటు అత్యయిక స్థితి ప్రకటించారు. ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున భద్రతాబలగాలు సుప్రీంకోర్టుకు చేరుకుని ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో న్యాయమూర్తిని అరెస్ట్‌ చేశారు.
*ఆయేషా మీరా హత్య కేసులో సిట్‌ విచారణ ప్రారంభమైంది. డీఐజీ శ్రీకాంత్‌ నేతృత్వంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని కళాశాల, హాస్టల్‌లో విచారణ కొనసాగిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఈ పునర్విచారణ ప్రారంభమైంది.
*హైదరాబాద్‌లో మరోసారి మాదకద్రవ్యాల కలకలం రేగింది. ఉత్తర మండలం పరిధిలో ఎల్‌ఎస్‌డీ, హెరాయిన్‌, చరాస్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఘటనలో నైజీరియన్‌, కశ్మీరీతో పాటు ఓ హైదరాబాద్‌ వాసిని పోలీసులు అరెస్టు చేశారు.
*నెల్లూరు రైల్వేస్టేషన్లో భారీగా బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసోం రాజధాని గుహవాటి నుంచి చెన్నైకి వెళ్తున్న రైలులో కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారం విలువ రూ. కోట్ల విలువ ఉంటుందన్నారు. స్టవ్ బర్నర్లలో బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
*జూబ్లీహిల్స్‌లో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
*ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం బొడ్డవరం జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా అవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు బస్సును నిలిపివేసి తనిఖీ చేయగా ఓ బ్యాగులో ప్యాకింగ్ చేసిన నాలుగు బండిళ్ళు లభ్యమయ్యాయి. అనంతరం వాటిని స్వాధీనం చేసకున్నారు.
*దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపుతప్పి పక్కకు దూసుకుపోవడంతో దాదాపు 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కల్యాణదుర్గం నుంచి అనంతపురానికి వెళ్తున్న బస్సు మార్గమధ్యలోని ఉరవకొండ నియోజకవర్గం, వెలుగుప్ప మండలం కాల్వపల్లి గ్రామం వద్ద రోడ్డుపై నుంచి పక్కకు దూసుకుపోయింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేస్తూ కిందకు దుకారు.
*ఆ నవ వధువు జీవితం మూణ్ణాళ్ల ముచ్చటైంది. కాళ్ల పారాణి ఆరకముందే మృత్యు ఒడికి చేరింది. భార్యభర్తల నడుమ వచ్చిన చిన్నపాటి గొడవకే ఉరివేసుకుందని భర్త చెబుతుండగా, భర్తే అదనపు కట్నం కోసం తమ కుమార్తెను చంపేశాడని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు.
*ప్రేమించిన వ్యక్తి దూరం పెట్టడం.. ఆస్తి తగాదా తోడు కావడం.. ధైర్యం చెప్పే కుటుంబ పెద్ద అండ లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎంటెక్‌ విద్యార్థిని లేఖ రాసి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
*హైదరాబాద్ మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో దారుణం జరిగింది. సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న హరిందర్ గౌడ్ తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చి పోలీసులకు లొంగిపోయాడు.
*తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో ఓ పిల్ల ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. ఓ వ్యక్తిపై దాడి చేసి ప్రాణాలు తీసిన ఈ పిల్ల ఏనుగుఎవరు కనిపిస్తే వారిని తరుముతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. సూళగిరి సమీపంలోని దేవరగుట్టపల్లి గ్రామానికి చెందిన మునిరాజు(శనివారం రాత్రి చిన్నారు వద్ద నడచి వెళ్తుండగా ఏనుగు దాడి చేసి అంతమొందించింది. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులుప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
*ప్రకాశం బ్యారేజ్‌లో దూకి నాగూర్ అనే విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నాగూర్ ఎంబీఏ చదువుతున్నాడు. తన తండ్రి బాషాతో ఉన్న గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పక్కనే ఉన్న స్నేహితులు వారిస్తున్న వినకుండా నగూర్ నదిలోకి దూకాడు. విషయం గమనించిన ఫైర్ సిబ్బంది విద్యార్థిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు అతడిని నదిలో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగూర్ పరిస్థితి విషమించడంతో చికిత్స కొనసాగుతుండగా మృతి చెందారు.
*అమెరికాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 70 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట) చోటుచేసుకుంది. 8 మంది సిబ్బంది, 139 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు, ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
* ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడనే మనస్తాపంతో ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
* మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్ళి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని మూసాపేట దగ్గర ఆగివున్న లారీని బొలేరో వాహనం ఢీకొంది. దీంతో బోలేరో ఉన్న ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
* ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపుర్ చెరువులోని నీటి కుంటలో పడి ఓ బాలుడు పడి మృతి చెందాడు.
* నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన మట్ట లింగేశ్వరి (17) అనే ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థి సాయి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని చల్లసముద్రం గ్రామపంచాయతీ క్యాంప్‌సెంటర్‌లో ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించి విఫలమయ్యారు.
* తల్లిదండ్రులు మందలించారని పటమటలోని దర్శిపేటకు చెందిన షేక్‌ నాగూర్‌ బాబా (22) ఆదివారం కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
* వివాహమైన నాలుగు నెలలకే ఓ వివాహిత తనువు చాలించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భర్త చెబుతుంటే…, భర్త, ఆడపడుచు హింస వల్లే చనిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
* రైలులో ప్రయాణికులపై హిజ్రాల కిరాతకం హెచ్చుమీరుతోంది. డబ్బులు ఇవ్వకపోతే దాడికి దిగుతున్నారు. హిజ్రాల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు.
* చిక్కబళ్లాపుర సమీపాన 44వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లా పామిడి పట్టణానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
* ప్రేమించిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందటంతో మనోవేదనకు గురైన ఓ ప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
* కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్‌ కలెక్టర్లపై దాడికి దిగిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లను ప్రకాశం జిల్లా ఒంగోలు జీఆర్పీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
* సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లతో అప్రమత్తంగా ఉండాల్సిందే. ఫేస్‌బుక్‌ విడుదల చేసిన తాజా సమాచారం ఈ విషయాన్ని నొక్కి చెబుతోంది.
* ఒడిశాలోని కటక్‌లోని బాదంబాడి ప్రాంతంలో భారీ అగ్రిప్రమాదం చోటు చేసుకొంది. రెండు హోటళ్లు, దుకాణ సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న వస్తు సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న 10 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. చుట్టుపక్కల ఉన్న భవనాలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది నిరోధించారు.
* కళాశాల భవనం పైనుంచి కిందికి దూకి ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన షేక్‌ రెహ్మాన్‌(21) కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడు ఎన్‌ఆర్‌ఐ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఐటీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు.
* రెండు పులులు పరస్పరం ఘర్షణ పడి తీవ్ర గాయాలపాలైన నేపథ్యంలో శనివారం మరో పులి మృతదేహం మహారాష్ట్రలోని తడొది అటవీ ప్రాంతంలో కనిపించింది. ఇది ఆడపులి. చంద్రపూర్‌ జిల్లాలోని బ్రహ్మపురి అటవీ విభాగపు పరిధిలోని తడొది బాలాపూర్‌ అటవీ ఉపక్షేత్రంలోని గంగాపూర్‌ హోటి ప్రాంతంలో శనివారం తీవ్రమైన దుర్గంధం రావడంతో గస్తీ తిరుగుతున్న వనరక్షకులు వి.ఎన్‌.బండేకర్‌, రాత్రి కాపలాదారు ఆనంద్‌రావు కామ్డే పరిసరాలను క్షుణంగా పరిశీలించగా పులి మృతదేహం కనిపించింది.
* మధ్యధరా సముద్రంలో జలసమాధి అయిన వలసదారుల్లో 20 మంది మృతదేహాలను మొరాకో సహాయ సిబ్బంది వెలికి తీశారు. మొరాకో ప్రాదేశిక జలాల్లో ఈ మృతదేహాలను స్పెయిన్‌కు చెందిన ఒక నౌక గుర్తించింది. ఈ వలసదారులు ఐరోపా చేరుకునేందుకు పశ్చిమ మధ్యధరా సముద్రం మార్గంలో పడవల్లో ప్రయాణిస్తున్నారు.
* అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలోని సైసే వద్ద ఆదివారం రెండు రైళ్లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో 70 మంది గాయపడ్డారు.
* మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన తొమ్మిది మందిలో ఆరుగురు యువకుల్ని ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏడాది క్రితం వీరిలో ఒకడు ముంబయి శివార్లలోని విలే పార్లేలో తొలుత బాలికపై అత్యాచారం చేశాడు.
* గుండెపోటుతో ఓ డ్రైవర్‌ ఆర్టీసీ బస్సులోనే ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లా రేణిగుంట చెక్‌పోస్టు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ విషాదం చోటుచేసుకుంది.
* కటక్‌ బాదంబాడి ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒక షాపింగ్‌మాల్‌తో పాటు హోటల్‌, మరికొన్ని షాపులు దగ్ధమయ్యాయి. రూ.కోట్లలో ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.
* ట్యాంకు బండ్‌ నిర్మాణ పనుల్లో భాగంగా తవ్విన నీటి గుంత ఐదో తరగతి విద్యార్థి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆదిలాబాద్‌ పట్టణంలో ఆదివారం జరిగిన ఘటన ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
* ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టులు పేట్రేగిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫాసిస్టు విధానాలను నిరసిస్తూ దండకారణ్యంతోపాటు మావోయిస్టులు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో శనివారం రాత్రి బీజాపూర్‌ జిల్లాలో భూపాలపట్నం నుంచి వస్తున్న బస్సును గోట్ల అటవీ ప్రాంతంలో తగులబెట్టారు.
* ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో చోరి జరిగింది. ఇంట్లోని బీరువాలో భద్రపర్చిన రూ.4లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్‌లో నివాసముంటున్న సినీ సంగీత దర్శకులు మణిశర్మ కొద్ది రోజుల క్రితం ఇంట్లోని బీరువాలో రూ.4లక్షల నగదును భద్రపర్చారు. ఆదివారం అవసరాల నిమిత్తం ఆ నగదును తీసేందుకు చూడగా నగదు కన్పించక పోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో మణిశర్మ మేనేజర్‌ సుబ్బానాయుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఈ చోరీ ఘటనపై ఫిర్యాదు చేశారు. డీఐ కె.రవికుమార్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com