నేటి తాజావార్తలు-౦౨/౦౬

*విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ఆదుకోవాలని, బడ్జెట్‌ కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ తెలుగుదేశం, వైకాపా ఎంపీలు పార్లమెంటు వేదికగా ఆందోళన ఉద్ధృతం చేశారు. ఈరోజు లోక్‌సభ ప్రారంభం కాగానే తెదేపా, వైకాపా ఎంపీలు స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని, రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ ప్లకార్లులను ప్రదర్శించారు.
*ప్రధాని నరేంద్రమోదీతో కేంద్రమంత్రి, తెదేపా రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఆయన చర్చించనున్నట్లు సమాచారం.
*రూ.8000 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, ఆమె భర్త శైలేష్ కుమార్‌, తదితరులపై దాఖలైన అనుబంధ ఛార్జిషీటుపై ఢిల్లీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 8న కోర్టు తీర్పు వెలువరించనుంది.
* ఈ నెల 12 నుంచి జూన్‌ 7 వరకు 116 రోజులపాటు రాష్ట్రంలో జలసంరక్షణ ఉద్యమ స్ఫూర్తి రెండో దశ పేరుతో పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏదైనా ప్రాధాన్య ప్రాజెక్టు ప్రారంభిస్తూ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నారు. రాష్ట్రంలో తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్న 29 ప్రాజెక్టులను ఈ ఉద్యమంలోపు పూర్తిచేసి జాతికి అంకితం ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు.
* పెంపుడు కుక్కల ఆరోగ్యం, వ్యాధి నిర్ధారణ, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై ఈ నెల 7 నుంచి 9 వరకు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్టు ఆడిటోరియంలో ఈ సదస్సు నిర్వహిచనున్నారు.
*గతంలో తన దిల్లీ పర్యటనలో ప్రధాని వద్ద ప్రస్తావించిన సమస్యలతో పాటు బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు లేకపోవటంపై ప్రధానికి వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్థేశం చేశారు. ప్రధాని తమకు సమయం కేటాయించారని రాష్ర తెలుగుదేశం ఎంపీలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
*ప్రధాని నరేంద్ర మోదీ పాలన దేశ సమగ్రత, సమైక్యతకు ముప్పుగా పరిణమించిందని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దేశంలో నాలుగేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా అనుబంధ సంస్థలు మతోన్మాద హింసను సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
*స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన స్వల్ప శ్రేణి ఖండాంత‌ర‌ క్షిపణి అగ్ని-1ను భారత్‌ మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని డా.అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
*లోక్‌సభలో కాంగ్రెస్‌- తెలుగుదేశం పార్టీ ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌లో తెలుగుదేశం ఎంపీలు నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి అన్యాయం జరగడానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమని తెదేపా సభ్యులు ఆరోపించారు. దీంతో కాంగ్రెస్‌-తెదేపా ఎంపీల మధ్య వాగ్వాదం నెలకొంది. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను కాసేపు వాయిదా వేశారు.
*బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి! ఇక మహిళలకైతే మరీనూ! పెళ్లిళ్లు.. ఫంక్షన్లూ ఇలా సందర్భానికో నగ ధరిస్తూ ఆనందపడుతుంటారు. ఈ మధ్య పురుషులు కూడా పసిడి అంటే మాకు ప్రియమే అంటున్నారు. అందుకే భారత్‌లో రోజురోజుకీ బంగారానికి డిమాండ్‌ పెరిగిపోతోంది.
* ఆంధ్రప్రదేశ్‌ అంశం సున్నితమైనదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్‌ అన్నారు. ఏపీపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. లోక్‌సభలో తెదేపా, వైకాపా ఎంపీలు చేస్తున్న అందోళనపై ఆయన స్పందిస్తూ ప్రకటన చేశారు. సభలో సభ్యులు సంయమనం పాటించాలని కోరారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చకు సహకరించాలన్నారు.
* ప్రతిపక్షoలో ఉండి ప్రముఖ పాత్ర పోషించాల్సిన జగన్ మాత్రం పాదయాత్ర అంటూ రోడ్లు పట్టుకు తిరుగుతూ రాష్ట్ర ప్రగతిని గాలికొదిలేశాడని మంత్రి కాల్వ శ్రీనివాస్‌ ఆరోపించారు.
*స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న కేరళ పేసర్‌ శ్రీశాంత్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు కేసును విచారణకు స్వీకరించిన ప్రత్యేక ధర్మాసనం నాలుగు వారాల్లోగా దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని బీసీసీఐకి ఆదేశాలు జారీ చేసింది.
*దక్షిణ కొరియాలో ఫిబ్రవరి 9 నుంచి శీతాకాల ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలో భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో 36,000 మంది విదేశాయులపై దక్షిణ కొరియా నిషేధం విధించింది.
*సిద్ధిపేట జిల్లాలోని శివార్లలో రూ. 3 కోట్లతో నిర్మించిన అత్యాధునిక పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావు, పోలీస్ హోసింగ్ బోర్డు చైర్మన్ దామోదర్ కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, సిద్దిపేట సీపీ శివకుమార్ పాల్గొన్నారు.
*పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల పురోగతిపై వ సారి సీఎం చంద్రబాు సమీక్ష నిర్వహించారని నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ… నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు మంత్రి దేవినేని అభినందనలు తెలిపారు.
*విపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయసభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ ప్రారంభంకాగానే కాంగ్రెస్‌ ఎంపీలు విభజన హామీలు నెరవేర్చాలని, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు.
*కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు జరపలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అయినప్పటికీ మన సామర్ధ్యం ద్వారా శాఖాపర కేటాయింపుల్లో ఎక్కువ సాధించుకోవాలని అధికారులకు దిశానిర్థేశం చేశారు.
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ మావోయిస్టులు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.
*భారత క్రికెటర్‌ శ్రీశాంత్‌పై నిషేధం అంశంపై సుప్రీంకోర్టు విచారించింది. శ్రీశాంత్‌పై నిషేధం విధించడంపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని బీసీసీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
*తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన రాజకీయ ఐకాస.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయనుంది. తుర్కయాంజల్‌లో జరిగిన ఐకాస విస్తృత స్థాయి సమావేశంలో కొత్త పార్టీని ఏర్పాటును ఐకాస ఛైర్మన్‌ కోదండరాం ప్రకటించారు.
*కడియం నర్సరీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కోరారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన నర్సరీ రైతులు కొందరు పవన్‌ను పార్టీ కార్యాలయంలో ఆదివారం కలిశారు.
* తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు 1.25 కోట్ల మంది భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు
* చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో మార్చి 11న టీఎస్‌ఆర్ కాకతీయ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో కాకతీయ లలిత కళా వైభవం మహోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సినీ నిర్మాత టీ. సుబ్బరామిరెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ పోలీసు కమిషనర్ జీ సుధీర్‌బాబు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ ఈగ మల్లేశం ఖిలావరంగల్ కోటలో స్థల పరిశీలన చేశారు.
* ఒకే ఒక్క రన్‌వేను కలిగి ఉన్న అత్యంత రద్దీ అయిన విమానాశ్రయంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ముంబయి విమానాశ్రయం మరో అరుదైన రికార్డు సృష్టించింది. గత నెల 24న ఈ విమానాశ్రయంలో 980 విమానాలు ల్యాండ్‌ అయ్యాయి. దీంతో ఒక్కరోజులోనే 974 విమానాలను ల్యాండ్‌ చేయడంతో గతేడాది డిసెంబరు 6న తమ పేరిటే నమోదైన రికార్డును అధిగమించినట్లు విమానాశ్రయ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
* తైవాన్‌ తూర్పు తీరంలో ఆదివారం భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా భూకంప అధ్యయన సంస్థ తెలిపింది. హ్యుయాలిన్‌ ఓడరేవు పట్టణానికి 15 కి.మీ.ల దూరంలో.. 8 కి.మీ.ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. అయితే నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలూ వెలువడలేదు.
* ఈనెల 17న దోమల్‌గూడలోని ఏవీ కళాశాలలో నిర్వహించే సభలో అన్నాహజారే పాల్గొంటారని నిర్వాహక సంస్థల ప్రతినిధులు తెలిపారు. మార్చి 23న దిల్లీలో చేపట్టే నిరాహార దీక్షలో భాగంగానే నగరంలో సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏవీ కళాశాల మైదానంలో నిర్వహించే సభకు కనీసం పదివేల మంది వస్తారని భావిస్తున్నామన్నారు.
*అత్యంత కీలకమైన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశానికి ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com