నేటి తాజావార్తలు-౧౧/౨౮

అన్నాడీఎంకే పార్టీ జెండాను తమ మద్దతుదారులు వినియోగించడాన్ని ఆ పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ సమర్థించుకున్నారు. దాన్ని ఉపయయోగించకుండా ఈసీ తమను నిరోధించలేదని అన్నారు.
*ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వినియోగదారులకు విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఇంధనశాఖ మంత్రి కళా వెంకట్రావు స్పష్టం చేశారు. ప్రతి అక్టోబర్‌, డిసెంబర్‌లో రెండు డిస్టమ్‌ల పరిధిలో ఏపీఈఆర్సీ ప్రజా విచారణ నిర్వహించి ఛార్జీలు పెంపుదదల, తగ్గుదలపై నిర్ణయం తీసుకుంటుందని శాసనసభలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ కోసం వారే స్వయంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ నియంత్రికల కొరత సమస్యను పరిష్కరిస్తామన్నారు.
*మెట్రో రైలు సర్వీసుల ప్రారంభోత్స‌వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ చేసిన విమర్శలను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. నగరానికి అరుదైన గౌరవంగా రూపొందుతున్న మెట్రో రైల్ ప్రారంభం సందర్భంగా తాను వివాదాల జోలికి వెళ్లనని వ్యాఖ్యానించారు.
*మెట్రో రైలు సర్వీసుల ప్రారంభోత్స‌వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ చేసిన విమర్శలను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. నగరానికి అరుదైన గౌరవంగా రూపొందుతున్న మెట్రో రైల్ ప్రారంభం సందర్భంగా తాను వివాదాల జోలికి వెళ్లనని వ్యాఖ్యానించారు.
*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ నీచ సంస్కృతి జగన్‌ను విషనాగై కాటేస్తుందని గిడ్డి ఈశ్వరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోట్లున్న వారికే సీట్లన్న జగన్ నిర్ణయం బాధించిందని గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులతో రాజకీయం చేయొచ్చని జగన్ భావిస్తున్నారని గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. జగన్ మా నమ్మకాన్ని వమ్ము చేశారని గిడ్డి ఈశ్వరి విమర్శించారు. గిరిజనుల మనోభావాలకు గౌరమిచ్చి.. సీఎం బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయడం సంతోషంగా ఉందని గిడ్డి ఈశ్వరి అన్నారు.
*తెలుగుదేశం పార్టీ, ఏపీ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతల అవినీతితో ప్రజలు విసుగు చెందారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాబోయే ప్రభుత్వం వైసీపీదేనని… జగన్ సీఎం కావడం ఖాయమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు.
*నగర మేయర్‌కు లేని ప్రోటోకాల్ కేవలం కేటీఆర్‌కు ఎందుకు? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జీఈఎస్‌లో పాల్గొనే వారిలో 52 శాతం మంది మహిళా ప్రతినిధులే ఉన్నారని, మహిళా మంత్రి ఉంటే సమ్మిట్‌లో పాలుపంచుకునేవారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. మెట్రో రైలు రెండేళ్లు ఆలస్యంగా ప్రారంభిస్తున్నారని అరుణ విమర్శించారు. అలైన్‌మెంట్ మార్పు పేరుతో ప్రాజెక్టును ఆలస్యం చేసి… కాంగ్రెస్‌కు క్రెడిట్ రాకుండా చేశారని ఆమె మండిపడ్డారు.
*రాజ్యసభ అవకాశం ఇస్తే వెళ్తానని మంత్రి యనమల అన్నారు.
నేను ఎక్కడ ఉండాలన్నది నా ఒక్కడి నిర్ణయం కాదని.. పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని మంత్రి యనమల స్పష్టం చేశారు. అది కావాలి…ఇది కావాలి అని నేనెప్పుడూ అడగలేదని ఆయన చెప్పారు. 35 ఏళ్లు రాష్ట్రంలో పనిచేశానని.. ఇది నా సుదీర్ఘ అనుభవం అని యనమల అన్నారు. నా అవసరం ఎక్కడ ఉంటుందనేది అధిష్టానం చూసుకుంటుందని మంత్రి యనమల చెప్పారు. మీడియాతో మంత్రి యనమల చిట్‌చాట్‌ నిర్వహించారు.
*ఇటీవల చోటుచేసుకున్న వరుస రైలు ప్రమాదాలను మర్చిపోకముందే… దేశరాజధాని ఢిల్లీలో మరో రైలు పట్టాలు తప్పింది. పల్వాల్ – న్యూఢిల్లీ – గజియాబాద్‌ల మధ్య నడిచే ప్యాసెంజర్ రైలు (64055)… వోక్లా వద్దకు చేరుకోగానే ఓ చక్రం పట్టాల నుంచి పక్కకుపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని నార్తరన్ రైల్వేస్ అధికారులు వెల్లడించారు. ప్రమాదం గురించి సమాచారం అందగానే డీఆర్ఎం సహా ఇతర అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు నార్తరన్ రైల్వేస్ సీపీఆర్ఓ తెలిపారు. ఈ మార్గంలోని రైళ్ల రాకపోకలకు కూడా ఎలాంటి సమస్య తలెత్తలేదని పేర్కొన్నారు.
*ఇంటర్నెట్‌లో అందరికీ సమానత్వం ఉండాలని భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) స్పష్టం చేసింది. ఇంటర్నెట్ అనేది ఓ బహిరంగ వేదిక అని, అందువల్ల ఇంటర్నెట్ సేవలు తప్పనిసరిగా వివక్షకు తావులేనివిధంగా ఉండాలని పేర్కొంది. అందరికీ సమానంగా ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలని తెలిపింది. దీనికి సంబంధించిన సిఫారసులను మంగళవారం కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ సిఫారసులను సుదీర్ఘ, బహుళ దశల సంప్రదింపుల ప్రక్రియ అనంతరం రూపొందించినట్లు తెలిపింది.
*పద్మావతి సినిమాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పద్మావతి సినిమాపై నిషేధం విధించాలని, దర్శకుడిపై, నిర్మాతలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్‌పై జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, పద్మావతి సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, నిషేధిస్తున్నట్లు ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రులపై, మంత్రులపై సుప్రీం కోర్టు మండిపడింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని కోర్టు మొట్టికాయలు వేసింది.
*ఉల్లి రిటైల్‌ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉల్లి ధరలు గృహిణులకు భారమవుతుంటే తాజాగా దేశ రాజధానిలో కిల్లో ఉల్లి రూ 80కి ఎగబాకింది. ఇతర మెట్రో నగరాల్లో కిలో ఉల్లి రూ 50 నుంచి రూ 70 పలుకుతోంది. ఆసియాలోనే అతిపెద్ద ఆజాద్‌పూర్‌ మండీలో మంగళవారం కిలో ఉల్లి రూ 80కి చేరిందని వ్యాపారులు చెప్పారు.
*వన్‌ప్లస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్‌ప్లస్‌ 5టీ స్మార్ట్‌ఫోన్‌ విక్రయానికి వచ్చింది. అమెజాన్‌ ఇండియా, వన్‌ప్లస్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా నేటి(మంగళవారం) నుంచి ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నట్టు కంపెనీ చెప్పింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి దీన్ని విక్రయానికి వచ్చింది. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు వన్‌ప్లస్‌ 5టీ స్మార్ట్‌ఫోన్‌పై పలు లాంచ్‌ ఆఫర్లను ప్రకటించాయి. 6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.32,999 కాగ, 8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ ధర రూ.37,999గా కంపెనీ తెలిపింది. మిడ్‌నైట్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.
*నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పథకమని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్ దీప్ పూరి ప్రశంసించారు. న్యూబోయిగూడ ఐడీ హెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీలో కేంద్ర మంత్రి హర్ దీప్ పూరి సందర్శించారు.
*నేపాల్‌లో ఓ చిన్నపాటి విమానం కూలింది. హుమ్లా జిల్లాలోని సిమికోట్‌లో ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్న 16 మంది ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. విమాన సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది. విమాన ముందు భాగంగా దెబ్బతిన్నది.
*రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంపై కేంద్రమంత్రి హర్‌దీప్‌పూరి ప్రశంసలు కురిపించారు. ఇవాళ న్యూబోయిగూడ ఐడీహెచ్ కాలనీలో కేంద్రమంత్రి హర్‌దీప్‌పూరి పర్యటించి..డబుల్ బెడ్‌రూం ఇండ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లు చాలా బాగున్నాయన్నారు. అన్ని రాష్ర్టాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల తరహాలో నిర్మాణాలు చేపడతామని హర్‌దీప్‌పూరి అన్నారు. హర్‌దీప్‌పూరితోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ కాలనీలో పర్యటించారు.
*మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా నిర్వహిస్తున్న ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సుకు ప్రముఖులు చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా సదస్సును ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఈడీ నారా బ్రాహ్మణి, అపోలో ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఉపాసన, సినీనటి మంచు లక్ష్మి తదితరులు మాట్లాడారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com