నేటి తాజావార్తలు


*తమిళనాడులో అర్కె నగర్ ఉప ఎన్నికకు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అక్కడి రాజాకీయం వేడెక్కింది. శశికళ మేనల్లుడు దినకరన్ తానే అక్కడ విజయం సాధిస్తానని ప్రకటించారు.
*వై.ఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు జనం మద్దతు బాగా లభిస్తుందని తెలుగుదేశంలో గుబులు ప్రారంభం అయిందని ఆ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ప్రకటించారు.
*కాంగ్రెస్స్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మత్స్య కారులతో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన రాహుల్ పనిలోపనిగా వారికి ప్రత్యేక వరాన్ని ప్రకటించాడు.
*రైతులకు ఉపయోగపడే ‘భూసేవ’ వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
*వైకాపా అధినేత జగన్ శుక్రవారం నాడు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. పద్మావతి చిత్రం కోసమా o యువకుడు జైపూర్ లోని నహాద్ ఘడ్ కోటకు వురి వేసుకుని చనిపోవడం సంచలంగా మారింది.
*కర్నూలు జిల్లాలో నిరుపేదల కోసం పదివేల్ పక్క గృహాలు నిర్మిస్తునట్లు మంత్రి నారాయణ ప్రకటించారు.
*పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ పదిహేనువ తేదీ నుండి జనవరి ఐదవ తేదీ వరకు నిర్వహిస్తున్నారు.
*తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రముఖ పుణ్యక్షెత్ర యదద్రిలో శుక్రవారం పర్యటించి అభివృద్ధి కార్యక్రామాలు పరిశీలించారు.
*ఎపీ జన్మభూమి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రాజదాని సమీపంలోని మందడం పాటశాలలో డిజిటల్ తరగతి గదిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
*ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాద్ పర్యటన సందర్బంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
*స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి.
*కోడి గుడ్డు ధరలతో పాటు ఉల్లిపాయల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
*అల్లు అర్జున్ తన కుమార్తె మొదటి పుట్టిన రోజు వేడుకలను సింగపూర్ లో నిర్వహించినట్లు సమాచారం.
*జేసీ సోదరులవి బ్లాక్ మెయిల్ రాజకీయాలని సొంత పార్టీ ముఖ్యమంత్రికి బ్లాక్ మెయిల్ చేసే నీచ స్థాయికి దిగజారారని వైకాపా తాడిపత్రి నియోజకవర్గ కన్వినర్ పెద్దారెడ్డి విమర్శించారు.
*హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
*వచ్చే 27 ,29 తేదీల్లో ప్రధాని మోడీ గుజరాత్ లో ఎన్నికల ప్రచారం లో పాల్గొంటారు.
* సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ శివారులోని నాగులబండ వద్ద వైమానికదళ శిక్షణ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు మహిళా పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాన్ని గమనించిన పైలట్‌ కిందకు దించేందుకు ప్రయత్నించగా… మంటలు చెలరేగి గాల్లోనే పేలిపోయింది.
* దేశంలో డిజిటల్ సంఖ్యను మరింత పెచ్న్హే చర్యల్లో భాగంగా బ్యాంకు ఖాతాదారులకు కల్పిస్తున్న చెక్ బుక్ ల సదుపాయాన్ని ఉపసంహరిచె అవకాసం ఉందంటూ వచ్చిన వార్తలను కేద్న్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖా తోసి పుచ్చింది. అసలు చెక్ బుకులను రద్దు హేయాలన్న ప్రతిపాదనే ప్రభుత్వం వద్ద లేదని స్పష్తం చేసింది.
*హైదరాబాద్ లో శనివారం రాత్రి విజయవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ కుమారుడు వివాహానికి ఆంద్ర రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తరలి వెళ్ళుతున్నారు.
*ప్రముఖ పుణ్య క్షెత్రం భద్రాచలంలో శ్రీరామ రక్ష అనే నూతన ఆర్జిత సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
*పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక చేనేత కార్మికుడికి యుకేలో ఒక విశ్వ విద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com