నేటి తాజా వార్తలు-౦౧/౧౮

* వచ్చే ఏడాది నుంచే గన్నవరం నుంచి హజ్ యాత్ర
ఆంధ్రాప్రదేశ్ హజ్ కమిటీ ద్వారా విజయనగరం, విశాఖపట్నం అనంతపురం జిల్లాల హజ్ యాత్రికులు విజయవాడలోని ఉపకలెక్టరు కార్యాలయంలో బుధవారం ఎంపిక చేసారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ , ఎమ్మెల్సీ మహ్మద్ అహ్మద్ , ఏపీ హజ్ కమిటీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుస్సేన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
*షూటింగ్‌ల నిమిత్తం వివిధ దేశాలకు వెళ్లేటప్పుడు తాను విమానాశ్రయాల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెబుతున్నారు పాకిస్థానీ నటి సబా కమర్. 2017లో వచ్చిన ‘హిందీ మీడియం’ సినిమాతో సబా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె ఇర్ఫాన్‌ ఖాన్‌కు జోడీగా నటించారు. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. వేరే దేశాలకు వెళ్లే సమయంలో విమానాశ్రయాల్లో తాను ఎదుర్కొంటున్న సంఘటనల గురించి సబా ఓ టీవీ కార్యక్రమంలో చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
*రాష్ట్రోపాధ్యాయ సంఘం 70వ వసంతాల వేడుకలు తిరుపతి పీఎల్‌ఆర్‌ కన్వెషన్‌లో ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు కోడె గౌరీశంకర్‌ తెలిపారు. గుంటూ రు జిల్లా రేపల్లెలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ న తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహిస్తామనిఉపాధ్యాయులు అధికసంఖ్యలో హాజరై విద్యా సదస్సురాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలను విజయవంతం చేయాలన్నారు.
*ఇంటర్నెట్ సోసల్ మీడియా పై కొన్ని నియంత్రణలు అవసరం వాంచనీయ కాకున్నా.. ఉగ్రవాదాన్ని తుద ముట్టించడానికి ఇంతకూ మించి మార్గం లేదు. దేశ భద్రతా కోసం ఇలాంటి చర్యలు తప్పని సరి.
*రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రాం ప్రకాష్ సిసోడియా ఎంపికయ్యారు. ఆయన పేరును ఖరారు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం సమాచారం అందింది. సిసోడియా ప్రస్తుతం గిరిజన సంక్షెమా శాఖా ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. సుమారు ఏడేళ్ళ పాటు ఉమ్మడి రాష్ట్రానికి ఎన్నికల ప్రధానాధికారిగా పని చేసిన భాన్వర్ లాల గత ఏడాది డిసెంబరులో ఉద్యోగ విరమణ చేసారు. ఆయన స్థానంలో సిసోదియాను ఎంపిక చేసారు.
*సెన్సార్ బోర్డు అనుంతి లభించినా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తమ చిత్ర విడుదలను నిషేధించటానికి సవాల్ చేస్తూ పద్మవాత్ నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చిత్రం విడుదల తేదీ సమీపిస్తున్నదున వెంటనే తమ పిటిషన్ విచారణకు స్వీకరించాలని అబ్యార్దనను దీపక్ మిశ్ర ఏఎం ఖంవిలాల్కర్ కూడిన ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. రాజస్తాన్, హరియానా, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు శాంతి భద్రతలు కారణాలతో వివాదాస్పద పద్మావత్ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి.
* రక్తదానం అనేది చాలా మంచిదనిగత మూడేళ్లుగా ఇదే విషయం చెబుతూ ఆచరిస్తున్నామని మంత్రి లోకేష్ సతీమణి బ్రహ్మణి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లెజండ్రీ బ్లాక్ డొనేషన్ క్యాంప్ డ్రైవ్ రక్తదాన శిబిరం నిర్వహించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికోడలు బ్రహ్మణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మణి మాట్లాడుతూ మన దేశంలో ఎన్ని యూనిట్ల బ్లడ్ అవసరమో… అందులో కేవలం 50 శాతం మాత్రమే అందుబాటులో ఉందని అన్నారు. క్యాన్సర్ ఆస్పత్రిలో చిన్న పిల్లలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూవారికి సరిపడ రక్తం లేకపోవడంతో ప్రాణాలు పోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల రక్తదానం అనేది చాలా ముఖ్యమని అన్నారు.
* యాదాద్రి ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక అధ్యయణోత్సవాలు, బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు స్వామివారి అధ్యయణోత్సవాలు, ఈ నెల 24 నుంచి 30 వరకు పాతగుట్ట దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 27వ తేదీన రాత్రి 10 గంటలకు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం, 28న దివ్య విమాన రథోత్సవం, 30న స్వామివారి శతఘట్టాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 20 నుంచి 23వ తేదీల్లో యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి అధ్యయణోత్సవాల సందర్భంగా నాలుగు రోజుల పాటు నిత్య, శాశ్వత కల్యాణాలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
*ఎన్డీఏ ఆధార ఒక నిర్భంద ఆయుధం
యూపీఏ ఆధార్ ప్రజలకు సాధికారత కల్పించే ఒక స్వచ్చంద ఉపకరణం ఎన్డీఏ అదార్ ప్రజలు సాదికారతను దెబ్బతీసే ఒక నిర్భంద ఆయుధం.
*బడ్జెట్ సమావేశాలు
2018-19 బడ్జెట్ రూపకల్పనకు సంబందించిన సమావేశాలకు ఈనెల 22 నుంచి నిర్వహించాలని ఆర్ధిక శాఖ నిర్ణయించింది. సాధారణంగా డిసెంబరు చివరి వారంలో జరగాల్సిన ఈ సమావేశాలు వరుస సెలవులు, జన్మభూమి, కలెక్టర్ల సదస్సు వంటి పలు కార్యక్రమాల వల్ల అలస్యంయ్యాయి. దీంతో 22న మంత్రుల , వివిధ శాఖల అధిపతులతో బడ్జెట్ పై గత కొన్నీలుగా జరుపుతున్న పొరపాట్లు ఈ బడ్జెట్ లో పునరావృతం అవకూడదని పేర్కొంటున్నారు.
* కొత్త ఆవిష్కరణలతోనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, భవిష్యత్ ఆవిష్కర్తలదేనని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అన్నారు. గురువారం ముంబయిలోని తాజ్‌ హోటల్‌లో ఆయన వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొన్నారు.
* కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం, పదవుల కోసం పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. గురువారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… సూర్య చంద్రులు ఉన్నంతవరకూ ఎన్టీఆర్ కీర్తి ఉంటుంది.. తెలుగు దేశం పార్టీ ఉంటుందన్నారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేసి పేదవాడి ఆకలి తీర్చి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేసిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. అయితే… కొంత మంది నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అవకాశాల కోసం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న శక్తులకు వ్యతిరేకంగా తెలుగుదేశం కార్యకర్తలు పార్టీని ముందుకు నడిపేందుకు సిద్ధంగా ఉన్నారని వెంకటవీరయ్య పేర్కొన్నారు.
* తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతరించిపోతోంది… మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలను నేను స్వాగతిస్తున్నానని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ లో టీడీపీని విలీనం చేస్తే మంచిదేనన్నారు. అలాగే… ఆనాడు ఎన్టీఆర్ పిలుపునిస్తేనే అందరం టీడీపీలో చేరామని నేడు కేసీఆర్ కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పిలుపునిస్తున్నారని కడియం పేర్కొన్నారు.
* రక్తం చిందకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణను పునర్‌నిర్మిస్తూనే దేశాభివృద్ధిలో భాగమయ్యామని ఆయ‌న తెలిపారు. ఆర్థికాభివృద్ధి రేటులో ఇదే ఒరవడిని కొనసాగిస్తామ‌న్నారు. సంస్కృతి సంప్రదాయాల విషయంలో ఆంధ్ర, తెలంగాణకు చాలా తేడా ఉందన్నారు. రెండు ప్రాంతాల ప్రజల జీవన విధానం వేర‌న్నారు. తెలుగు అనే ఐడేంటీనే లేదు. భాషాప్రయుక్త రాష్ట్రాల‌ పేరుతో ఆంధ్ర – తెలంగాణ విలీనం చారిత్రక తప్పదం. నిజాం హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా వర్థిల్లిందన్నారు. హైద‌రాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఇండియాటుడే సౌత్‌కాన్‌క్లేవ్ జరగింది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ప్ర‌ముఖ‌ జ‌ర్న‌లిస్టు రాజ్‌దీప్ సర్‌దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. మూడేళ్లలో తెలంగాణ అభివృద్ధిలో మార్పు ఎలా సాధ్యమైందివిభజనకు ముందున్న అనుమానాలన్నీ ఎలా నివృత్తి చేయగలిగారని రాజ్‌దీప్ ప్రశ్నించారు. ఆ ప్ర‌శ్న‌ల‌కు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com