నేటి తాజా వార్తలు-౦౨/౦౨

* నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అధ్యాపకుల అటెండెన్స్‌పై ముగ్గురు సభ్యులతో కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
* హెచ్‌ఎండీఏలో ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కె పురుషోత్తంరెడ్డి కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పురుషోత్తంరెడ్డి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడనే ఫిర్యాదుపై సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల గల 11 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
* పరిపాలన బాగోలేకపోతే ఏ ప్రభుత్వాన్నీ ప్రజలు ఉపేక్షించరనడానికి రాజస్థాన్ ఉపఎన్నికలే ఉదాహరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన నివాసంలోని ప్రజాదర్బారు హాలులో నిర్వహించిన తెదేపా సమన్వ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
* అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్‌ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలని జగన్‌ను సీబీఐ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారు. ఈ కేసులో జగన్‌తో పాటుగా వైసీపీ నేత విజయ్‌సాయిరెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు. జగన్‌ సంస్థల్లో రాంకీ పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీట్‌లో తన పేరును తొలగించాలని విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది శ్రీరామ్‌ జనవరి 20న కోర్టులో వాదనలు వినిపించారు.
*చారిత్రక వారసత్వ కట్టడాలకు నెలవైన హైదరాబాద్‌కు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. చరిత్రకు సజీవ సాక్షాలతో నెలవైన సాలార్‌జంగ్‌ మ్యూజియం అభివృద్ధిమరమ్మతు పనుల కోసం బడ్జెట్‌లో రూ.27.99 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
*తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి చైర్మన్‌ పదవికి కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పేరు ఖరారెనట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. పాలక మండలి మొత్తం వివరాలు ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. సుధాకర్‌ యాదవ్‌ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి గతంలో కొంత అభ్యంతరం వ్యక్తమైంది. కానీ తర్వాత ఉభయపక్షాల మధ్య చర్చలతో అభ్యంతరం పరిష్కారమైందని చెప్తన్నారు.
*ఫిబ్రవరి 5న తెలంగాణ దండకారణ్య బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, దండకారణ్యంలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
* వనదేవతలు సమ్మక్క, సారలమ్మను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న ఆయనకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వాగతం పలికారు. అమ్మవార్ల దర్శనానికి ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిలువెత్తు బంగారం(బెల్లం)మొక్కును చెల్లించుకున్నారు.
* కేంద్ర బడ్జెట్‌ దారుణంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సీఎం నివాసం వద్ద ప్రజాదర్బారులో తెదేపా సమన్వయ కమిటీ సమావేశమైంది. పలువురు మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు బడ్జెట్‌లో కర్ణాటక, ముంబయి, అహ్మదాబాద్‌లకు బాగానే కేటాయింపులు చేశారని ఏపీ పట్ల చిన్న చూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.
* మే నెలకు సంబంధించి మొత్తం 61,858 శ్రీవారి అర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సాధారణ పద్ధతిలో 50,945 టికెట్లు, డిప్‌ పద్ధతిలో 10,913 టికెట్లు విడుదల చేశారు.
* మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో శుక్రవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. భూకంప లేఖినిపై తీవ్రత 3.4గా నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
*కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని డీఆర్‌ఎం కార్యాలయం ఎదుట రైల్వే ఉద్యోగులు మహా ధర్నా చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వే కేంద్రాలకు చెందిన ఉద్యోగులు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు.
* శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులందరికీ కడుపునిండా ఆహారం అందజేయాలనే ఉద్దేశంతో టీటీడీ మరిన్ని అన్నప్రసాదాల స్టాళ్లు పెంచనుంది. ప్రస్తుతమున్న మూడు స్టాళ్లతో పాటు మరో మూడిటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే తిరుమలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద కేంద్రంతో పాటు ఎంప్లాయీస్‌, వైకుంఠం-2, మాధవనిలయం, పద్మావతి, ఎస్వీ గెస్ట్‌ హౌస్‌లోని క్యాంటీన్‌లో ఆహారపదార్థాలు తయారు చేస్తుంటారు.
* మేడారం జనసంద్రమైంది. సమ్మక్క-సారమ్మలు గద్దెలపై కొలువయ్యారు. రెండు రోజులపాటు భక్తులు ఇద్దరు తల్లుల దీవెనలు అందుకుంటారు. మొన్న సారలమ్మ గద్దెకు చేరుకోగా…నిన్న సమ్మక్క గద్దెపై కొలువైంది. దీనితో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. గిరిజన పూజారులు అమ్మవార్లకు ఘనస్వాగతం పలికితే..పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపి అమ్మవారిని స్వాగతించారు.
* తమిళనాడులో జరిగే సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు సంబంధించిన అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌ అయిదు ప్రశ్నలను రూపొందించి రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉంచారు.
* శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. మే నెలకు 61,858 టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. సాధారణ పద్ధతిలో 50,945 టిక్కెట్లు, డిప్‌ పద్ధతిలో 10,913 టిక్కెట్లను విడుదల చేసింది. డిప్‌ పద్ధతిలోనే సుప్రభాత సేవకు 8,013 టిక్కెట్లను ప్రకటించింది. తోమాల సేవకు 150, అర్చనకు 150, నిజపాద సేవకు 2,300, అష్టాదళ పాదపద్మారాధన సేవకు 300, విశేష పూజకు 1500, కల్యాణోత్సవానికి 11,628, ఊంజల్‌ సేవకు 3,100, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 6,665, సహస్రదీపాలంకరణ సేవకు 14,725, వసంతోత్సవానికి 13,330 టిక్కెట్లను తితిదే విడుదల చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com