నేటి తాజా వార్తలు-౦౨/౦౪

*కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మనం సైలెంట్‌గా కూర్చుంటే కుదరదని అన్నారు. ప్రధాని మోదీ ఫోటోలు పెట్టలేదని కొంతమంది బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని… అది నిజం కాదని సీఎం అన్నారు. పార్టీలకతీతంగా కేంద్ర బడ్జెట్‌ను అందరూ వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇంకా నాటకాలాడుతున్నారని సీఎం మండిపడ్డారు. వీటన్నింటిపై ప్రజలకు వివరించాలని టీడీపీపీ సమావేశంలో చంద్రబాబు నేతలకు సూచించారు.
*ఎస్టీల్లో చేర్చాలంటూ శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద మత్స్యకారులు చేస్తున్న దీక్ష వద్దకు వెళ్లిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంఘీభావం మాట ఎలా ఉన్నా.. అక్కడ ఉన్న పసుపు రంగు కరపత్రాన్ని చూసి తీవ్రంగా స్పందించారు.
*అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. తెదేపా పార్లమెంటరీ సమావేశంలో పాల్గొనేందుకు అమరావతికి వచ్చిన ఆయన ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో వైద్యులు ఆయన బీపీ, షుగర్‌ లెవల్స్ ను పరీక్షించారు. జేసీ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసం లేదని స్పష్టం చేశారు.
* బాలయోగి గురు కుల పాఠశాల అధ్యాపకుడు, మండలంలో ని తిమ్మాపురానికి చెందిన పుల్లగూర లూకాపాల్‌ ఇండియన్‌ ఐకానిక్‌ పర్సనాలి టీ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యారంగం లో విశేష కృషిసల్పిన వారికి ది గ్లోరియస్‌ ఆర్గనైజెషన్‌ ఫర్‌ యాక్సిలరేటెడ్‌ లిటరసీ (గోల్‌) అందజేసే జాతీయస్థాయి అవార్డు ను 2018 ఏడాదికి లూకాపాల్‌కు ప్రదానం చేయనున్నారు.
*తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈనెల 10 నుంచి 18 వరకు నవ్యాంధ్ర పుస్తక సంబరాలు నిర్వహిస్తున్నామని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ చైర్మన్‌ స్వర్ణ వెంకటనారాయణ, కార్యదర్శి లక్ష్మయ్య చెప్పారు. శనివారం కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 29 ఏళ్లుగా తమ సొసైటీ బుక్‌ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తున్నదని, ఈ ఏడాది విజయవాడతోపాటు రాష్ట్రంలో పది కేంద్రాల్లో నవ్యాంధ్ర పుస్తక సంబరాల పేరిట ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
*టీడీపీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 20న అమరావతిలో దళిత మహాసభను నిర్వహిస్తున్నట్లు మంత్రి కేఎ్‌స..జవహర్‌ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
*రైతులను, నిరుద్యోగులను, ముఖ్యంగా ఏపీ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిన కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఈ నెల 8న రాష్ట్ర బంద్‌ పాటించాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. బంద్‌కు వైసీపీ, జనసేన, కాంగ్రె్‌సతోపాటు రాష్ట్రంలోని ఇతర పార్టీలు మద్దతు ప్రకటించాలని కోరారు. శనివారం విజయవాడలో మధు, అనంతపురంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు.
*తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. దాదాపు 75వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి సుమారు 8 గంటలు, దివ్యదర్శనానికి 2గంటలు పడుతోంది. సోమవారం సేవలకు సంబంధించి విజయాబ్యాంకులో ఆదివారం లాటరీ ద్వారా జారీచేసే టికెట్లు.. సుప్రభాతం: 50, కల్యాణోత్సవం: 80, డోలోత్సవం: 25, విశేషపూజ: 125. ఆన్‌లైన్‌లో రూ.300 టికెట్లు పొందడానికి www.ttdsevaonline.comలో సంప్రదించాలి.
*ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషి ఈ నెల 7, 8 తేదీల్లో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశాలను నిర్వహించనున్నారు. సీఎ్‌సగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి అన్ని శాఖల అధికారులతో సమావేశమవ్వాలని ఆయన నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల పనితీరుపై చర్చించనున్నారు.
*డిపార్ట్ మెంటల్‌ పరీక్షలను ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీఎ్‌సపీఎస్సీ వెల్లడించింది. 13వ తేదీ (మహా శివరాత్రి) మినహా మిగతా రోజుల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు ఈ నెల 5 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. కాగా, అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2, సివిల్‌/డెంటల్‌/స్పెషల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, ట్యటర్స్‌, లెక్చరర్‌ ఇన్‌ రేడియాలజికల్‌ ఫిజిక్స్‌, ఫిజియోథెరఫిస్టు రాతపరీక్షల ‘ఫైనల్‌ కీ’లు ఈ నెల 5 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టీఎ్‌పీఎస్సీ ప్రకటించింది
* తెలుగుదేశం పార్టీకి భాజపాతో మిత్రబంధం కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కేంద్రమంత్రి సుజనాచౌదరి అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్నాయంపై పార్లమెంటులో గళం విప్పాలని తమ అధినేత చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com