నేటి తాజా వార్తలు-౦౨/౧౩

* రేపు శివరాత్రి సందర్భంగా ఎంపీ సుబ్బిరామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం శివాభిషేకంసాయంత్రం రుద్రాభిషేకం చేయనున్నారు. ఈ దర్భంగా కైకా‌ల సత్యనారాయణకు విశ్వనట సామ్రాట్ బిరుదు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హీరోబాలకృష్ణ,మోహన్‌బాబుబ్రహ్మానందం హాజరుకానున్నారు. శోభానాయుడు బృందం కూచిపూడి నృత్యప్రదర్శనశ్రీకృష్ణ రాయబారంభక్తిపాటల విభావరి ఏర్పాటు చేశామని టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు.
* ఏపీ డీజీపీ పూనం మాలకొండయ్య సోమవారం మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, పెదకళ్లేపల్లిలోని నాగేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు.
* కర్నూలుజిల్లాలోని కోవెలకుంట్ల ఏటిగట్టు ప్రాచీన శివాలయం దగ్గర పుట్టలో శివపార్వతుల పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. శివపార్వతుల పంచలోహ విగ్రహాలకు పూజలు చేసేందుకు భారీగా స్థానికులు చేరుకుంటున్నారు.
* ప్రైవేటు నగల దుకాణానికి విచ్చేసిన హీరోయిన్‌ సమంతను చూసేందుకు వచ్చిన అభిమానులు దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సివచ్చింది. తమిళనాడు కృష్ణగిరి జిల్లా కేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
* తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటి ఈషా రెబ్బా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆమె వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
* స్వాతంత్ర్యం కోసం పోరాడటం గత చరిత్ర అయితే.. రాష్ట్రప్రయోజనాల కోసం పోరాడటం ప్రస్తుత చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై ఆయన జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
*విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరులో వైకాపా ర్యాలీ నిర్వహించింది. వైకాపా విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ముస్తాఫా పాల్గొన్నారు. ‘ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు’ అని నినదిస్తూ లాడ్జి సెంటర్ నుంచి శంకర్ విలాస్ కూడలి వరకు ప్రదర్శన చేపట్టారు.
*నరసరావుపేట మండలంలోని కాకాని గ్రామంలో జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో వివిధ విభాగాల ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తం కుదిరింది. మూడేళ్ల క్రితమే మంజూరైన ఈ సంస్థ నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు తలెత్తగా వాటిని అధిగమించిన ప్రభుత్వం ఈనెల 17న భూమిపూజ నిర్వహించేందుకు నిర్ణయించింది. *శ్రీవారికి ఓ భక్తుడు కారును విరాళంగా ఇచ్చారు. అనంతపురానికి చెందిన వాహనాల సరఫరా సంస్థ యజమాని రూ.10 లక్షల విలువచేసే మారుతీ వాహనాన్ని తితిదే అధికారుకు అందజేశారు. శ్రీవారి ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కారుకు చెందిన దస్త్రాలను, తాళాన్ని అధికారులు స్వాదీనం చేసుకున్నారు. దీన్ని తితిదే అవసరాలకు కారును వినియోగిస్తామని వారు తెలిపారు.
*గొల్ల, కురుమల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏప్రిల్‌ 29న జింఖానాగ్రౌండ్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు.
* శ్రీకాళహస్తిలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం తరఫున మంత్రి మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు సమర్పించారు.
* విశాఖ జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఈ రోజు ఉదయం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. గేదెలపాడు టిక్కరిపడు సమీపంలో మావోయిస్టులు కాల్పులకు పాల్పడినట్లు సమాచారం.
*భారత చెస్‌ స్టార్‌, గ్రాండ్‌మాస్టర్‌ హరికృష్ణ పెళ్లికి ఏర్పాట్లు జోరందుకున్నాయి. తాను ప్రేమించిన సెర్బియా చెస్‌ క్రీడాకారిణి నదెడ్జాను మార్చి 3న హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో వివాహమాడనున్నట్లు ఇప్పటికే వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పెళ్లి ఆహ్వాన వీడియోను హరి మీడియాకు విడుదల చేశాడు. హరికి కాబోయే భార్య ఫొటో కూడా ఇందులో ఉంది.
*దిల్లీలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకూ జరగనున్న ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు (డబ్ల్యూఎస్డీఎస్‌)లో పాల్గొని ప్రసంగించాల్సిందిగా కేంద్ర ఇంధన వనరుల సంస్థ (టీఈఆర్‌ఐ) నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది.
*భక్తకోటితో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్టాలు, కర్ణాటక నుంచి భక్తులు తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల ఆరో రోజు ఆదివారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు పుష్పపల్లకి సేవ వైభవంగా జరిగింది.
*యాదాద్రి శ్రీలక్ష్మినర్సిం హాస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ఆయన సతీమణి విమలా నరసింహన్‌లను అధికారులు ఆహ్వానించారు. యాదాద్రి దేవాయాల అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు జి.కిషన్‌రావు, దేవాలయ ఈవో గీత ఆదివారం రాజ్‌భ వన్‌లో గవర్నర్‌ దంపతులను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.
*అర్చకుల దీర్ఘకాలిక సమస్యలు, గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల గురించి చర్చించేందుకు ‘అర్చక ఆత్మావలోకన సదస్సు’ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ అర్చక సమాఖ్య నిర్ణయించింది. ఈనెల 16న విజయవాడ శివారులోని గొల్లపూడిలో ఉన్న దేవదాయ కమిషనర్‌ కార్యాలయం సమీపంలో రెండువేలమంది అర్చకులతో ఈ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు ఓ ప్రకటనలో తెలిపారు. అర్చకులకు వారసత్వ హక్కు, నందాదీపం బకాయిల విడుదల, హెల్‌్ోకార్డులు తదితర అంశాలపైనా సదస్సులో చర్చిస్తామని వివరించారు.
*కుతుబ్‌షాహీల పాలన ప్రారంభమై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ(మన్నూ)లో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు డెక్కన్‌ హిస్టరీ సొసైటీ ప్రధాన కార్యదర్శి సెమినార్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సయ్యద్‌ అయూబ్‌ అలీ సికింద్రాబాద్‌లో తెలిపారు.
* జేఏసీ ఏర్పాటుపై మాజీ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ కుమార్లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్‌తో సోమవారం భేటీ అయ్యారు. విభజన హామీల అమలు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ జేఏసీ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. పవన్ సూచనతో జేపీఉండవల్లి హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు.
* ప్రధాని మోదీ తన నాలుగురోజుల పర్యటనలో భాగంగా మస్కట్‌లోని మత్రాహ్ ఏరియాలో ఉన్న ఏళ్ల పురాతన శివాలయాన్ని సందర్శించారు. ఆలయంలో పూజలు చేసిన అనతరం వెలుపలే వేచియున్న భారతీయ సంతతికి చెందిన వారితో ఆయన ముచ్చటించారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అతి పురాతన ఆలయాల్లో ఈ శివాలయం ఒకటి. ఒమన్ సుల్తాన్ ప్యాలెస్‌కు సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని గుజరాత్‌కు చెందిన వ్యాపార వర్గాలు ఏళ్ల క్రితం నిర్మించారు. లో దీనిని పునరుద్ధరించారు. ఈ ఆలయంలో ప్రధాన దేవతామూర్తులుగా శ్రీ ఆది మోతీశ్వర్ మహదేవ్శ్రీ మోతీశ్వర్ మహదేవ్్రీ హనుమాన్‌జీ ఉన్నారు. పండుగలుప్రధాన ఉత్సవాల్లో ఈ ఆలయాన్ని మందికి పైగా భక్తులు దర్శిస్తుంటారు. ఆలయ దర్శనానంతరం సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శించేందుకు మోదీ వెళ్లారు. ఇవాళే ఆయన తిరిగి ఇండియాకు పయనమవుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com